JJ Perry : పాన్ ఇండియా సూపర్ స్టార్ యశ్ నటిస్తున్న చిత్రం టాక్సిక్. గతంలో ప్రశాంత్ నీల్ తీసిన కేజీఎఫ్ దుమ్ము రేపింది. అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దీంతో తన స్టార్ ఇమేజ్ అమాంతం పెరిగి పోయింది. కేజీఎఫ్ సీక్వెల్ ను కూడా అదే స్థాయిలో ఆదరించారు..ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నారు. ప్రస్తుతం కొత్త ప్రాజెక్టు టాక్సిక్ లో కీలక పాత్రలో నటిస్తున్నాడు యశ్. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు దర్శకురాలు గీతు మోహన్ దాస్.
JJ Perry Praises Yash Toxic Movie
ఇందులో కృతి సనన్ మరో పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి మూవీ మేకర్స్ ఇంకా కన్ ఫర్మ్ చేయలేదు. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ రేంజ్ లో టాక్సిక్ ను తీస్తున్నారు. ఇదిలా ఉండగా టాక్సిక్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు హాలీవుడ్ యాక్షన్ దర్శకుడు జెజె పెర్రీ(JJ Perry). టాక్సిక్ సినిమా గురించి స్పందించారు. ఈ మూవీని ఆయన బ్యాంగర్ అని పిలిచారు. దీనిపై యశ్ స్పందించాడు. హాలీవుడ్ డైరెక్టర్ కు ధన్యవాదాలు తెలిపారు నటుడు, దర్శకురాలు.
ఇదిలా ఉండగా టాక్సిక్ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో వెంకట్ కె. నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మించారు. తన యాక్షన్ కొరియోగ్రఫీకి పేరు పొందాడు పెర్రీ. యష్ తో కలిసి దిగిన ఫోటోను కూడా ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశాడు. టాక్సిక్ తో కలిసి పని చేయడం ఆనందంగా ఉందన్నాడు. ప్రత్యేకించి తన ఫ్రెండ్ యశ్ ను మరిచి పోలేనని పేర్కొన్నాడు. అద్భుతమైన వ్యక్తి అంటూ ప్రశంసలు కురిపించాడు పెర్రీ.
Also Read : Beauty Priyanka Chopra-SSMB29 :హొలీ వేడుకల్లో ప్రియాంక చోప్రా వైరల్