Hit 3 : ప్రముఖ నటుడు నాని సమర్పిస్తున్న చిత్రం హిట్ 3(Hit 3). ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ప్రేమ వెల్లువ పాట విడుదలైంది. మంచి ఫీల్ గుడ్ ఉండేలా సాహిత్యంతో పాటు సంగీతం అందించడం విశేషం. ఇప్పటికే రిలీజ్ చేసిన సింగిల్ కు రెస్పాన్స్ వచ్చింది. దర్శకుడు శైలేస్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోష్టర్ కెవ్వు కేక అనిపించేలా చేసింది.
Hit 3 Movie Song Viral
మార్చి 24న సోమవారం ప్రేమ వెల్లువ విడుదలై గుండెలను మీటుతోంది. మధురంగా ఉంది. ఎప్పటి లాగే సిద్ శ్రీరామ్ మరింత ఆర్ద్రతతో పాడాడు. కళ్లకు కట్టేలా దర్శకుడు పాటను చిత్రీకరించాడు. గేయ రచయిత కూడా ఫీలింగ్స్ కలిగించేలా చేయడంలో సక్సెస్ అయ్యాడని చెప్పక తప్పదు. ఇక జనాదరణ పొందేలా సంగీతం అందించడంలో అందె వేసిన చేయి మిక్కీ జె మేయర్ ది. తను ఎంచుకున్న సినిమాలకు అద్భుతంగా మ్యూజిక్ అందించి మ్యాజిక్ చేస్తాడు. ఇక ఈ ప్రేమ వెల్లువ తప్పకుండా యూట్యూబ్ చార్ట్స్ లోకి చేరుతుంది.
కృష్ణకాంత్ ఈ పాటను రాశాడు. సిద్ తో కలిసి నూతన మోహన్ శ్రావ్యంగా పాడారు. ఇక అర్జున్ సర్కార్ అనే కఠినమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు నాని. డాక్టర్ శైలేష్ కొలను డైరెక్షన్ లో ప్రశాంతి త్రిపుర్నేని నిర్మిస్తున్నారు ఈ హిట్ 3 మూవీని. కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఇక ప్రేమ వెల్లువ పాటకు అద్భుతంగా కొరియో గ్రఫీ అందించాడు విశ్వ రఘు. ఎక్కడా అసభ్యత లేకుండా ఫీలింగ్ కలిగేలా చూశాడు. వాల్ పోస్టర్ సినిమా , యూనానిమస్ ప్రొడక్షన్స్ సమర్పిస్తోంది ఈ చిత్రాన్ని.
Also Read : Megastar Crazy Update :మెగాస్టార్ చిరంజీవి క్రేజీ అప్టేడ్