Hero Darshan : కన్నడ హీరో దర్శన్ కు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

కన్నడ హీరో దర్శన్ కు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు...

Hello Telugu - Hero Darshan

Hero Darshan : క‌న్న‌డ ఆగ్ర న‌టుడు దర్శన్‌కు కాస్త ఉప‌శ‌మ‌నం ల‌భించింది. ఆయ‌న‌కు కర్నాటక హైకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. దర్శన్‌కు శస్త్ర చికిత్స జరగాల్సి ఉండటంతో జస్టిస్ ఎస్.విశ్వజిత్ శెట్టి ఆరు వారాల తాత్కాలిక బెయిల్‌ను మంజూరు చేశారు. అభిమానిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన కేసులో దర్శన్ కటకటాలపాలైన సంగతి తెలిసిందే. చాలా ప్ర‌య‌త్నాల త‌ర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో దర్శన్‌(Hero Darshan)కు తాత్కాలికంగా ఊరట లభించింది.

Hero Darshan Case..

బ్యాక్ పెయిన్ కారణంగా తనకు శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉందని, బెయిల్ మంజూరు చేయాలని దర్శన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారించిన కర్నాటక హైకోర్టు అతని అభ్యర్థనను మన్నించి బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ మంజూరు సందర్భంలో దర్శన్ కు కోర్టు కొన్ని షరతులు పెట్టింది. దర్శన్ తన పాస్ పోర్ట్ ను సరెండర్ చేసి, తాను కోరుకున్న హాస్పిటల్‌లో ఏడు రోజుల లోపు ట్రీట్మెంట్ తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది.

ఇదిలాఉండ‌గా న‌టుడు త‌న వీరాభిమాని చిత్రదుర్గ రేణుకాస్వామి హత్యకేసులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న నటుడు దర్శన్, ఏ1 నిందితు రాలు పవిత్రగౌడలను జూన్‌ 11న అరెస్టు చేశారు. ఆ త‌ర్వాత గ‌త సెప్టెంబ‌ర్ 21న‌ దర్శన్‌ తరపు న్యాయవాదులు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం వారి బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. తాజాగా ఇప్పుడు ద‌ర్శ‌న్ ఆప‌రేష‌న్ నిమిత్తం హైకోర్టు తాత్కాలిక బెయిల్ ఇచ్చింది. దీపావ‌ళి పండ‌గ అనంత‌రం శ‌స్త్ర చికిత్స చేయించుకుని ద‌ర్శ‌న్ తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.

Also Read : Naga Chaitanya : ‘క’ సినిమా ఈవెంట్ లో హైలైట్ గా నిలిచిన నాగచైతన్య స్పీచ్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com