ఒక్కోసారి ఒక్కో సంగీత దర్శకుడు లైమ్ లైట్ లోకి వస్తుంటారు. ఇప్పుడు ఒకే ఒక్కడి పేరు వినిపిస్తోంది. ఓ వైపు అనిరుధ్ రవిచందర్ టాప్ లో కొనసాగుతోంటే..మరో వైపు ఎస్ఎస్ థమన్, దేవిశ్రీ ప్రసాద్ దుమ్ము రేపుతుంటే ..హేషమ్ అబ్దుల్ వహాబ్ మాత్రం నిశ్శబ్ద విప్లవంలా దూసుకు వచ్చాడు.
గతంలో మలయాళంలో వచ్చిన హృదయం మూవీలోని ఘర్షణా సాంగ్ కుర్రకారును పిచ్చెక్కించింది. తాజాగా శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఖుషీ మ్యూజికల్ హిట్ గా నిలిచింది. తాజాగా శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్న ఓ నాన్న సినిమా ఇప్పుడు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషలలో వస్తోంది.
ప్రత్యేకించి మలయాళం అయినప్పటికీ హిందీ, ఉర్దూ, తెలుగు మీద మంచి పట్టుంది హేషమ్ అబ్దుల్ వహాబ్ కు. హిందీలో ఓ పాపా పేరుతో పాటలను తయారు చేసే పనిలో పడ్డాడు మ్యూజిక్ డైరెక్టర్. తాజాగా సాయా తేరా సాంగ్ ను అనురాగ్ కులకర్ణి, చిన్మయి శ్రీపాద పాడారు. గుండెల్ని పిండేసేలా ఉంది ఈ పాట. దీనిని కౌసర్ మునీర్ రాశారు.
విడుదలైన వెంటనే వేలాది మంది ఆస్వాదిస్తున్నారు. పాటను అందించిన వహాబ్ కు , పాడిన చిన్మయికి ఫిదా అవుతున్నారు.