హాయ్ నాన్న సినిమాకు సంబంధించి విడుదలైన సమయమా సాంగ్ ఆకట్టుకుంటోంది. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాట ఇప్పుడు ప్రతి నోటా వినిపిస్తోంది. నేచురల్ స్టార్ నాని, అందాల తార మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.
ఇక హృదయం తో హిట్ కొట్టి శివ నిర్వాణ తీసిన ఖుషీతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన మలయాళం సినీ దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ హాయ్ నాన్నకు సంగీతం అందిస్తుండడం విశేషం.
ఈ మూవీకి సంబంధించి తాజాగా మూవీ మేకర్స్ సమయమా అన్న పేరుతో పాటను విడుదల చేశారు. ప్రస్తుతం యూట్యూబ్ లో , సోషల్ మీడియాలో టాప్ లో కొనసాగుతోంది. ఇద్దరి మధ్య ప్రేమ ఎంత మధురమో, ఎంత ముఖ్యమో , ఒకరినొకరు దూరమైతే ఎలాంటి ఇబ్బంది ఉంటుందో అనంత్ శ్రీరామ్ చక్కగా వివరించి చెప్పే ప్రయత్నం చేశారు ఈ పాటలో.
కొత్తగా శౌర్యువ్ హాయ్ నాన్న చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పాటకు ప్రాణం పోశాడు మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే ఖుషీ పాటలు వైరల్ గా మారాయి. తాజాగా ఈ సాంగ్ కూడా వాటితో పాటో పడుతోంది. ఈ ఏడాది డిసెంబర్ 21న హాయ్ నాన్నను విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నారు.
ఈ సమయమా పాటను అనురాగ్ కులకర్ణి, సితార కృష్ణకుమార్ పాడారు. వీణను హరిత అందిస్తే , గిటార్స్ అనురాగ్ రాజీవ్ నయన్ ఇచ్చారు. ఇక సాంగ్ కు సంబంధించి ప్రవీణ్ ఆంథోనీ అద్భుతంగా ఎడిటింగ్ చేశాడు . ఇది సినిమాకు హైలెట్ గా మారుతుందనడంలో సందేహం లేదు.