Hesham Abdul Wahab : మొన్న హృదయం ఇవాళ ఖుషీతో ఒక్కసారిగా యావత్ సినీ ప్రపంచం తన వైపు తిప్పుకునేలా చేశాడు సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్. ఫీల్ గుడ్ లా ఉండేలా జాగ్రత్త పడ్డాడు. సంగీతంలో ఫ్రెష్ నెస్ ఉండేలా చూసుకున్నాడు. ఇంకేం ఖుషీ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. కోట్లు కొల్లగొడుతోంది. సినిమా విజయంలో మ్యూజిక్ డైరెక్టర్ పాత్ర కీలకంగా మారింది.
Hesham Abdul Wahab Kushi Success
యూత్ ను , అన్ని వర్గాలను ఆకట్టుకునేలా సంగీతం ఇచ్చాడు హేషమ్ అబ్దుల్ వహాబ్(Hesham Abdul Wahab). అక్టోబర్ 14, 1990లో పుట్టాడు. 33 ఏళ్లు. సంగీత దర్శకుడు మాత్రమే కాదు అద్భుతమైన గాయకుడు, ఆడియో ఇంజనీర్ కూడా.
2022లో వచ్చిన మలయాళ చిత్రం హృదయం బిగ్ సక్సెస్. దీనికి తనే సంగీతం అందించాడు వాహబ్. బ్రిటీష్ గాయకుడు, గేయ రచయిత సామీ యూసుఫ్ నిర్మించిన సంగీత ఆల్బమ్ ఖధమ్ తో ప్రసిద్ది చెందాడు. సంగీత విధ్వాంసుల కుటుంబంలో పుట్టడంతో మనోడికి సంగీతం చిన్నతనం నుంచే అబ్బింది.
కర్నాటిక్, హిందూస్తానీ సంగీతంలో శిక్షణ పొందాడు వాహాబ్. ఎనిమిదేళ్ల వయసులోనే పాడటం చేశాడు. 11 ఏళ్లప్పుడు పియానోతో పరిచయం అయ్యాడు. 2007లో సౌదీ నుండి ఇండియాకు వచ్చాడు. ప్లే బ్యాక్ సింగర్ గా, మ్యూజిక్ చేసేలా ట్రై చేశాడు . 2013లో మేరీ దువాతో పేరు పొందాడు.
సాల్ట్ మ్యాంగో ట్రీతో సంగీత దర్శకుడిగా మారాడు. జానా మేరీ జానాకు అవార్డు దక్కింది. 2022లో వచ్చిన హృదయం సెన్సేషన్ గా నిలిచింది. తాజాగా తెలుగులో శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఖుషీ మూవీకి సంగీత దర్శకుడిగా పని చేశాడు. బిగ్ సక్సెస్ గా నిలిచింది. దీంతో వాహాబ్ హాట్ టాపిక్ గా మారాడు.
Also Read : Shiva Nirvana : ఖుషీ సక్సెస్ ఊహించిందే – శివ నిర్వాణ