Thug Life: ప్రముఖ దర్శకుడు మణిరత్నం… లోక నాయకుడు కమల్ హాసన్ లక్రేజీ కాంబో వస్తున్న తాజా సినిమా ‘థగ్ లైఫ్(Thug Life)’. సుమారు 36 ఏళ్ళ తరువాత వీరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాను కమల్ హాసన్ కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మణిరత్నంకు చెందిన మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి, శాండిల్ వుడ్ స్టార్ హీరో దుల్హర్ సల్మాన్, సిద్ధార్ధ్, దక్షిణాది భాషల అగ్ర నటి త్రిష కీలక పాత్రలు పోషించగా పలువురు జాతీయ అవార్డు గ్రహీతలు టెక్నీషియన్స్ గా వర్క్ చేస్తున్నట్లు గతంలో చిత్ర యూనిట్ ప్రకటించింది. కమల్ హాసన్ పుట్టిన రోజు సందర్భంగా గతేడాది నవంబరు 7న చిత్ర యూనిట్ విడుదల చేసిన టైటిల్ వీడియోతో పాటు సినిమా ఫస్ట్ లుక్ కు పాన్ ఇండియా లెవల్ లో మంచి రెస్సాన్స్ వచ్చింది.
Thug Life Movie Updates
సుమారు 36 ఏళ్ళ తరువాత మణిరత్నం-కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. రెండవ షెడ్యూల్ సెర్బియాలో జరగనుంది. అయితే ఇండియాలో లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో పార్టీ వ్యవహారాల్లో పాల్గొనడానికి ఆయన అర్ధాంతరంగా చెన్నైకు తిరిగి వచ్చారు. ఈ సినిమా తదుపరి షూటింగ్ ను ఎన్నికల తర్వాత మళ్లీ సెర్బియాకు వెళ్లి జరుపుతారని సమాచారం. దీనితో కమలహాసన్ కాల్ షీట్స్ దొరక్కపోవడంతో ఇందులో నటిస్తున్న ఇతరుల కాల్‌షీట్స్ వ్యవహారంలోనూ సమస్యలు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇలాంటి సమస్యలు కారణంగానే ఇప్పటికే ఈ చిత్రం నుంచి జయం రవి, దుల్కర్ సల్మాన్, సిద్ధార్ధ్ తప్పుకున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఇందులో దుల్కర్ సల్మాన్ పాత్రను శింబు నటిస్తారనే ప్రచారం కూడా జరిగింది.
అయితే ఈ కాల్ షీట్స్ దొరక్క సినిమా నుండి తప్పుకున్న జయం రవి, దుల్కర్ సల్మాన్, సిద్ధార్ధ్ లు తిరిగి ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కానున్నట్లు మరల ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమిళనాడులో పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన తరువాత ప్రారంభం కాబోయే షెడ్యూల్ లో కమల్ హాసన్ తో కలిసి ఈ హీరోలు ప్రాజెక్టులో జాయిన్ అవుతారని కోలీవుడ్ వర్గాల సమాచారం. అయితే ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి ఆ హీరోలు తప్పుకున్న విషయం…. అలాగే తిరిగి జాయిన్ అయిన విషయంపై చిత్ర యూనిట్ నుండి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు.
Also Read : Sukumar: జిమ్ లో తీవ్ర కసరత్తులు చేస్తున్న దర్శకుడు సుకుమార్ భార్య !