Samantha : టాలీవుడ్ హీరోయిన్ సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సామ్ తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశారు. “మనం మళ్లీ కలిసే వరకు, నాన్న” అంటూ హార్ట్ ఎమోజిని కలిగి ఉంది. సమంత చెన్నైలో జోసెఫ్ ప్రభు, నీనెట్ ప్రభు దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి, తెలుగు ఆంగ్లో-ఇండియన్. సమంత జీవితంలో ఆమె తండ్రి ముఖ్య పాత్ర పోషించారని గతంలో ఎన్నోసార్లు సామ్ చెప్పుకొచ్చింది.
Samantha Father No More
ఓ వైపు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సామ్ తన తల్లిదండ్రులను కలిసేందుకు ప్రాధాన్యత ఇస్తుండేది. సినీరంగంలో తనకు ప్రతి క్షణం తన తండ్రి అండగా, మద్దతుగా నిలిచారని తెలిపింది. సామ్ తండ్రి మరణవార్త తెలియడంతో సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కార్డియాక్ అరెస్ట్ తో జోసఫ్ ప్రభు నిన్న రాత్రి నిద్రలోనే కన్నుమూసినట్లు సమాచారం. రేపు సామ్ తండ్రి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
Also Read : Sivakarthikeyan : హీరో శివకార్తికేయన్ ను అవార్డుతో సత్కరించిన ఇండియన్ ఆర్మీ