Hero Vishal: న్యూయార్క్ వీధుల్లో గర్ల్ ఫ్రెండ్ తో విశాల్ ?

న్యూయార్క్ వీధుల్లో గర్ల్ ఫ్రెండ్ తో విశాల్ ?

Hello Telugu - Hero Vishal

Hero Vishal: కోలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విశాల్, ఓ అందమైన అమ్మాయితో న్యూయార్క్ వీధుల్లో చక్కర్లు కొడుతూ కేమరాకు చిక్కాడు. రోడ్డుపై వెళ్తున్న ఈ జంటను చూసి హే విశాల్(Vishal)… విశాల్… అంటూ కొంతమంది వీడియో తీయడానికి ప్రయత్నించడంతో… వెంటనే ముఖాన్ని కవర్ చేసుకొని అక్కడినుండి పారిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనితో కోవిడ్ ప్రేమల్ పడ్డాడని, డేటింగ్ లో ఉన్నాడంటూ కథనాలు మొదలయ్యాయి. మరికొందరు అయితే సినిమా ప్రమోషన్స్‌ కోసం ఇలాంటి పనులు చేస్తారా అంటూ కొందరు విమర్శించారు. దీనితో ఎట్టకేలకు ఆ వైరల్ వీడియోపై స్పందించాడు యువ హీరో విశాల్.

Hero Vishal – వైరల్ వీడియోపై క్లారిటీ ఇచ్చిన విశాల్

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోపై స్పందించాడు విశాల్. ‘‘అందరూ నన్ను క్షమించండి. ఆ వీడియో ఎందుకు తీయాల్సి వచ్చిందో చెప్పే సమయం వచ్చింది. అందులో కొంచెం వాస్తవం.. కొంచెం ప్రాంక్‌ ఉంది. లొకేషన్‌ ప్రకారం అది న్యూయార్క్‌లో తీసిందే. నేను, మా కజిన్స్‌ తరచుగా అక్కడకు వెళ్లి సరదాగా గడుపుతుంటాం. నా ఒత్తిడిని తగ్గించుకోవడానికి, ఏడాదంతా పడిన కష్టాన్ని మర్చిపోవడానికి న్యూయార్క్‌కు వెళ్తాం. ఆ వీడియోలో నేను మొహం ఎందుకు దాచుకున్నానంటే.. అదొక ప్రాంక్‌ వీడియో. క్రిస్మస్‌ రోజు నాతో సరదాగా మా కజిన్స్‌ అందరూ ప్రాంక్‌ వీడియో చేశారు. నన్ను ఆటపట్టించడం కోసం చేశారంతే. అలా చేయాలని నాతో చెప్పి వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇప్పటికైనా దానిపై వస్తున్న ఊహాగానాలకు తెరపడుతుందని ఆశిస్తున్నా. కొంతమంది ఆ వీడియో వీక్షించి నన్ను టార్గెట్‌ చేసి మాట్లాడుతున్నారు. కానీ నేను ఎవరినీ ద్వేషించాలని అనుకోవడం లేదు’’ అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

Also Read : Orhan Awatramani : శృతి నాతో తప్పుగా ప్రవర్తించింది అన్న ఒర్హాన్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com