Hero Vikram: భిన్నమైన కథలను ఎంచుకుంటూ, పాత్రలతో ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్. శేషు, అపరిచితుడు, శివపుత్రుడు, పొన్నియిన్ సెల్వన్, తంగలాన్ వంటి ఛాలెంజింగ్ రోల్స్ తో అటు క్లాస్ ఇటు మాస్ ప్రేక్షకులను సంపాదించుకున్న విక్రమ్(Hero Vikram)… ‘చిన్నా’ ఫేమ్ ఎస్.యు. కుమార్ దర్శకత్వంలో తన 62వ సినిమాను చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో తనమునకలైన చిత్ర యూనిట్… వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమాను సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. రియా శిభు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించనున్నారు. ఇంకా పేరు ఖరారు కాని ఈ సినిమాకు సంబంధించి మూడు నిమిషాల నలభై మూడు సెకండ్ల నిడివితో చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన అనౌన్స్‌మెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Hero Vikram – ఆకట్టుకుంటున్న ‘చియాన్ 62’ అనౌన్స్‌మెంట్ వీడియో
చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తోన్న 62వ సినిమా అప్‌డేట్ ను అనౌన్స్‌మెంట్ వీడియో రూపంలో అందించింది చిత్ర యూనిట్. ఈ అనౌన్స్‌మెంట్ వీడియోను చూస్తే మాస్ లుక్‌లో విక్రమ్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్‌లో కొందరు వ్యక్తులను చితకబాదుతున్న విక్రమ్ ను చూసి షూట్ చేయడానికి పోలీసులు భయపడటం… పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్లిపోతున్న విక్రమ్‌ను ఎవరు నువ్వు అంటూ ఎస్ఐ ప్రశ్నించడం… ఇది అసలైన ప్రశ్న అంటూ విక్రమ్ సమాధానం ఇవ్వడం ఈ అనౌన్స్‌మెంట్ వీడియోలో హైలైట్‌గా నిలుస్తోంది. బైక్ నిండా కూరగాయాల సంచులు వేలాడదీసుకుంటూ మొబైల్‌లో మాట్లాడుతూ విక్రమ్ వెళ్లినట్లుగా ఈ అనౌన్స్ మెంట్ వీడియో ఎండ్ అవడంతో… ఈ సినిమాలో ఫ్యామిలీ అంశాలకు యాక్షన్, మాస్ హంగులను మేళవించి రూపొందిస్తోన్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ నటించిన ‘తంగలాన్’తో పాటు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన ‘ధృవ నక్షత్రం’ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.
Also Read : Avatar-3: ‘అవతార్ 3’ కు డేట్ ఫిక్స్