Hero Vijay : విజయ దేవరకొండ గురించి చెప్పాల్సిన పని లేదు. తను నటించిన గీత గోవిందం సూపర్ హిట్. యంగ్ రొమాంటిక్ హీరోగా ఇప్పటికే పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ను స్వంతం చేసుకున్న ఈ నటుడు ఫుల్ బిజీగా ఉన్నారు వరుస సినిమాలతో. సమంత రుత్ ప్రభుతో కలిసి ఖుషీలో నటించి మెప్పించాడు. ఆ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఇదే సమయంలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన మూవీ ఆశించిన మేర ఆడలేదు.
Hero Vijay VD12 Movie Updates
ఈ తరుణంలో తాజాగా జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వీడీ12 చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఇటీవలే హరీశ్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహరాజా రవితేజతో కలిసి నటించిన ముంబై భామ భాగ్యశ్రీ బోర్సే కొత్త మూవీలో రౌడీతో జతగా నటిస్తోంది.
ఈ సినిమాను ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ – శ్రీకర స్టూడియోస్ , సితార ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా వీడి12ను నిర్మిస్తోంది. తమిళ సినీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా ఈ సినిమా గురించి కీలక అప్ డేట్ వచ్చింది. వచ్చే మార్చి 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ లో పూర్తి కాక పోవడంతో మే 12న రిలీజ్ చేస్తామని పేర్కొన్నారు దర్శకుడు.
Also Read : Actor Naresh Struggles : నరేష్ ప్రయాణం 52 ఏళ్ల ప్రస్థానం