Hero Venu : టాలీవుడ్ హీరో వేణు తొట్టెంపూడి ఇంట్లో పెను విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి తొట్టెంపూడి వెంకట సుబ్బారావు (92) కన్నుమూశారు. వేణు తండ్రి ప్రొఫెసర్‌గా పనిచేశారు. అతను గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలిసింది . మొన్నటి వరకు ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. దీనికి సంబంధించి ప్రకటన కూడా విడుదలైంది.
Hero Venu Father No More
సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. దీంతో వేణు ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. సుబ్బారావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
వేణు(Hero Venu) తండ్రి వెంకట సుబ్బారావు మృతదేహాన్ని ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సందర్శనార్థం ఉంచుతారు. ఈరోజు మధ్యాహ్నం వరకు హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలోని స్టీల్ & మైన్స్ కాంప్లెక్స్‌లోని ఆయన భౌతికకాయం ఉంటుందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఇక హీరో వేణు విషయానికొస్తే, ఒకప్పుడు స్వయంవరం… తన సినిమాల ద్వారా మనల్ని నవ్వించే హీరో తొట్టెంపూడి వేణు. అతను శ్రియతో కలిసి నటించిన సదా మీ సేవలో తర్వాత, అతను చిత్రాలలో తక్కువ హీరో పాత్రలు పోషించాడు. 2013లో వచ్చిన ‘రామాచారి’ సినిమా తర్వాత సినీ పరిశ్రమ నుంచి పూర్తిగా తప్పుకున్న వేణు.. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దమ్ము’ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించాడు. చాలా విరామం తర్వాత రవితేజ నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో తిరిగి వచ్చాడు. గతేడాది ‘అతిథి’ వెబ్ సిరీస్‌లో కూడా కనిపించాడు. ఆయన ఇంకా ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారని వినికిడి.
Also Read : Megastar Viswambhara : భారీ ధర పలికిన చిరు ‘విశ్వంభర’ డిస్ట్రిబ్యూషన్ రైట్స్