Hero Varun Tej : వరుణ్ తేజ్ ‘మట్కా’ సినిమా నుంచి నయా లుక్

త్వరలో మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ ఇస్తామని మేకర్స్ చెబుతున్నారు...

Hello Telugu - Hero Varun Tej

Hero Varun Tej : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తోన్న పాన్-ఇండియన్ మూవీ ‘మట్కా’. ‘ పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌, వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌(పై రజనీ తాళ్లూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మాణంలో హైబడ్జెట్, టాప్ టెక్నికల్ వేల్యూస్‌‌తో తెరకెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన లుక్స్ అదిరిపోమే రెస్పాన్స్ తెచ్చుకుని మూవీపై అంచ‌నాల‌ను మ‌రింత‌గా పెంచాయి. ఈక్ర‌మంలో సినిమా నుంచి హీరో లుక్‌ను విడుద‌ల చేశారు. తాజాగా రిలీజ్ చేసిన వ‌రుణ్ తేజ్(Hero Varun Tej) ఓల్డ్ గెట‌ప్‌ లుక్ అరాచ‌కం అనేలా ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేస్తోంది. వ‌రుణ్ నుంచి ఇది ఉహించ‌లేద‌న్న‌ట్లుగా సినీ ల‌వ‌ర్స్ షాక‌వుతున్నారు. అయితే ఈ చిత్రంలో వ‌రుణ్ తేజ్ మూడు, నాలుగు విభిన్న పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్న‌ట్లు స‌మాచారం. కాగా మూవీలో వరుణ్ తేజ్ సరసన నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి క‌థానాయిక‌లుగా నటిస్తుండ‌గా నవీన్ చంద్ర, పి రవి శంకర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Hero Varun Tej Maktka New Look

ఇటీవ‌లే హైదరాబాద్‌ రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమాలో చాలా కీలకమైన సన్నివేశాలు, హై-ఆక్టేన్ యాక్షన్ సీన్స్, రెట్రో థీమ్ సాంగ్స్‌ను చిత్రీక‌రించారు. కలర్‌ఫుల్ పబ్ సెట్‌లో బాలీవుడ్ న‌టి నోరా ఫతేహీ తో జానీ మాస్ట‌ర్ సార‌థ్యంలో ఓ పాట‌ను తెర‌కెక్కించారు. గ‌తంలో యావత్ దేశాన్ని కదిలించిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా ఉండ‌నున్న‌ట్లు తెలుస్తుండ‌గా వరుణ్ తేజ్ 4 పాత్ర చాలా ఛాలెంజింగ్ ఉంటుంద‌ని స‌మాచారం. త్వరలో మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ ఇస్తామని మేకర్స్ చెబుతున్నారు. కాగా ఈ సినిమాను తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియాగా విడుదల చేయ‌నుండ‌డం విశేషం.

Also Read : Parvathy Thiruvothu : ఇప్పుడు సమాజంలో ప్రతిదీ రాజకేయమే

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com