Hero Varun Tej : సినిమా ప్రియులకు ‘మట్కా’ వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తుంది

విజయవాడలోని ఫ్యాన్స్‌ సమక్షంలో టీజర్‌ విడుదల చేయడం సంతోషంగా ఉంది...

Hello Telugu - Hero Varun Tej

Varun Tej : వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా కరుణ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మట్కా’. తాజాగా ఈ సినిమా టీజర్‌ విడుదలైంది. ఈ సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరుణ్‌ తేజ్‌(Varun Tej) అభిమానులను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మట్కా ఫ్యాన్స్‌ గర్వపడే సినిమా అవుతుందన్నారు.

Varun Tej Movies Update

‘‘విజయవాడలోని ఫ్యాన్స్‌ సమక్షంలో టీజర్‌ విడుదల చేయడం సంతోషంగా ఉంది. మీరు అభిమానులు కాదు. మా కుటుంబ సభ్యులు. పెదనాన్న, బాబాయ్‌తోపాటు మమ్మల్ని కూడా ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్‌. నేను నటించిన గత మూడు చిత్రాల్లో చిన్న తప్పులు జరిగాయి. ‘ గద్దలకొండ గణేష్‌’ తర్వాత అలాంటి సినిమాలు మళ్లీ ఎందుకు చేయడం లేదని నన్ను చాలామంది అడిగారు. అలా అడిగిన, నా నుంచి అలాంటి సినిమా కోరుకుంటున్న వారి కోసమే ఈ ‘మట్కా’. మాస్‌ జాతరలా ఉంటుంది. సినీ ప్రియులను కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. ట్రైలర్‌ విడుదలయ్యాక దీని గురించి మరిన్ని విషయాలు చెబుతాను. తప్పకుండా అభిమానులు గర్వించే సినిమా అవుతుంది’’ అని వరుణ్‌ తేజ్‌ చెప్పారు. 1958 నుంచి 1982 వరకూ సాగే పీరియాడిక్‌ కథగా ఈ చిత్రం రూపొందుతుంది. మీనాక్షి చౌదరి కథానాయిక. వరుణ్‌తేజ్‌ నాలుగు విభిన్నమైన అవతారాల్లో కనిపించనున్నారు. విజేందర్‌ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు.

Also Read : Salman Khan : ఆ హీరోయిన్ తో సినిమాకి నో చెప్పిన సల్మాన్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com