Hero Varun Tej : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ‘మట్కా’ సినిమా టీమ్

కాగా మట్కా మూవీ ప్రమోషన్లలో భాగంగా తిరుపతిలో బుధవారం (నవంబర్ 13) మరో ఈవెంట్ జరగనుంది...

Hello Telugu - Hero Varun Tej

Varun Tej : గని, గాంఢీవ ధారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్.. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులతో ఢీలా పడిపోయాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. అందుకే ఇప్పుడు మట్కా(Matka) అంటూ పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో మన ముందుకు వస్తున్నాడీ మెగా హీరో. కరుణ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న సినిమా గురువారం ( నవంబర్ 14)న గ్రాండ్ గా విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా ఇటీవలే విశాఖ పట్నంలో గ్రాండ్ గా ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది.

తాజాగా హీరో వరుణ్ తేజ్ తో పాటు మట్కా టీమ్ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సినిమా విడుదలకు ఒక రోజు ముందు టీమ్ అంతా కలిసి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. మట్కా మూవీ సూపర్ హిట్‌ కావాలని ప్రత్యేక పూజులు చేశారు. ఈ సందర్భంగా ఆలయాధికారులు వీరికి సాదర స్వాగతం పలికారు. అనంతరం దర్శనం చేయించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు వీరికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Varun Tej Makta Movie Team..

కాగా మట్కా మూవీ ప్రమోషన్లలో భాగంగా తిరుపతిలో బుధవారం (నవంబర్ 13) మరో ఈవెంట్ జరగనుంది. ఎన్‌విఆర్ సినిమాస్‌లో జరిగే ఈవెంట్‌కు వరుణ్ తేజ్ తో పాటు చిత్ర బృందమంతా హాజరుకానున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే.. మట్కా జూదాన్ని ముంబైలో ప్రారంభించిన రతన్ ఖాత్రి జీవితం ఆధారంగా మట్కా సినిమాను తెరకెక్కించారు. బర్మా నుంచి శరణార్థిగా వచ్చిన వాసు.. వైజాగ్ ను ఎలా ఏలాడన్నదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో సలోని, సత్యం రాజేష్, రవి శంకర్, కిషోర్, నవీన్ చంద్ర, అజయ్‌ ఘోష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ స్వరాలు సమకూర్చారు.

Also Read : Lucky Bhaskar Collections : బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న లక్కీ భాస్కర్’

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com