Varun Tej : ‘మట్కా’ స్టోరీ పై క్లారిటీ ఇచ్చిన హీరో వరుణ్ తేజ్

వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ " వాసు అనే వ్యక్తి ప్రయాణమే ఈ కథ...

Hello Telugu - Varun Tej

Varun Tej : “నటనకు ఆస్కారం ఉండే పాత్రలు చేయాలన్నది నా కోరిక. ‘ గద్దలకొండ గణేశ్‌’ తర్వాత అలాంటి ప్రాజెక్ట్‌ దొరకలేదు. గత మూడు చిత్రాలు సరిగ్గా ఆడలేదు. ఆయా చిత్రాలను కొంత మంది ప్రేక్షకులు మాత్రమే ఆదరిస్తారని ముందే ఊహించాం. కానీ ఫలితం మేము ఆశించినట్లు లేదు. విభిన్నమైన సినిమా చేయాలనుకుంటున్న తరుణంలో కరుణకుమార్‌ ఈ కథ చెప్పారు. నా గత చిత్రాలు విడుదల కాకముందే ఈ సినిమా ఓకే చేశా. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది’’ అని వరుణ్‌ తేజ్‌(Varun Tej) అన్నారు. ఆయన హీరోగా కరుణకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మట్కా(Matka)’ మీనాక్షి చౌదరి కథానాయిక. నవంబర్‌ 14న ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమం చిత్ర బృందం మీడియాతో మాట్లాడారు. ఓజీ చిత్రంలో యాక్ట్‌ చేయడం లేదని అన్నారు.

Varun Tej Comment

వరుణ్‌ తేజ్‌(Varun Tej) మాట్లాడుతూ ” వాసు అనే వ్యక్తి ప్రయాణమే ఈ కథ. 1958లో చిన్నతనంలోనే శరణార్థిగా బర్మా నుంచి వైజాగ్‌కు వస్తాడు. అక్కడి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ ‘మట్కా(Matka)’ కింగ్‌లా ఎలా మారాడనేది కథ. ఇందులో లుక్‌తోపాటు డబ్బింగ్‌ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నారు. 100 శాతం ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఆ విషయంలో మేము చాలా నమ్మకంగా ఉన్నాం. పెదనాన్న చిరంజీవికి నా సినిమా ట్రైలర్లు చూపించి బాగుందా, లేదా అని అడుగుతుంటా.

వారం క్రితం ఈ సినిమా ట్రైలర్‌ చూపించా. చాలా నచ్చిందన్నారు. మాస్‌గా ఉందన్నారు. దాంతో నా నమ్మకం మరింత బలపడింది. మట్కా గేమ్‌ గురించి నేను కరుణకుమార్‌ దగ్గరే విన్నా. మట్కాలో మీనాక్షి పాత్ర కీలకంగా ఉంటుంది. వాసు దగ్గర ఏమీ లేనప్పుడు ఆమె అండగా నిలుస్తుంది. అతడు తప్పులు చేస్తే తిట్టి మంచి మార్గంలో నడిచేలా చేస్తుంది. ఒక వ్యక్తి జీవితంలో ఏ స్థ్థాయికి వెళ్లినా పెళ్లాం మాట వినాల్సిందే. ఇక వ్యక్తి విషయాలకు వస్తే.. మహిళలు ఆలోచించి ప్రశ్నలు వేయాలి. అప్పుడే మేము ఆలోచించి సమాధానం చెబుతాం. లావణ్య ఆలోచించే అడుగుతుంది. తను కరెక్ట్‌గా చెప్పినప్పుడు వింటాను.

నా సినిమాకు బాబాయ్‌ నటించిన తొలిప్రేమ సినిమా టైటిల్‌ పెట్టినప్పుడు కంగారుపడ్డా. ఎంతో ఆలోచించి చివరకు ఆ పేరు పెడితేనే నప్పుతుందని దానిని ఉపయోగించాం. ‘ తొలిప్రేమ’ బాబాయ్‌ కల్ట్‌ సినిమా. ఆ పేరు పాడుచేయకూడదని ఆలోచించి.. సినిమా చూశాక తప్పకుండా మంచి సినిమా అవుతుందనిపించింది. అందుకే ఆ టైటిల్‌ పెట్టాం. దర్శకుడు కరుణ కుమార్‌ మాట్లాడుతూ రతన్‌ ఖత్రి అనే గ్యాంబ్లర్‌ స్టోరీని ఆధారంగా చేసుకొని ‘మట్కా’ అనే ఫిక్షనల్‌ కథ సిద్థం చేశా. అలాంటి వ్యక్తి వైజాగ్‌లో పుడితే ఎలా ఉంటుంది? అనే విధంగా దానికి కమర్షియల్‌ హంగులు జోడించి తీర్చిదిద్దాం.

ఇందులో వాసు ఫైటర్‌. మంచి, చెడులను కాలే కడుపే నిర్ణయిస్తుందని ఈ సినిమాలో ఓ డైలాగ్‌ ఉంటుంది. కాబట్టి మంచి లేదా చెడు అనే వాటిని ఎవరూ నిర్ణయించలేరు. వరుణ్‌తేజ్‌ని ఏవిధంగా చూడాలని అభిమానులు కోరుకుంటున్నారో అలా మట్కాలో చూపించా. ఆయనలోని అన్ని కోణాలను ఈ సినిమా ఆవిష్కరిస్తుంది. 40 ఏళ్ల క్రితం జరిగిన ఓ వాస్తవ సంఘటనను ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన సినిమా ఇది. ఆ సమయంలో విశాఖపట్నం, అక్కడ మనుషులు ఎలా ఉండేవారు? హీరో ప్రస్థానం ఎలా మొదలైంది? అనే విషయాలను ఇందులో చూపించాం. ఈరోజు నుంచి రోజుకో అప్‌డేట్‌ ఇస్తూనే ఉంటాం’’ అని అన్నారు.

‘లక్కీ భాస్కర్‌’లో హీరో డబ్బు కోసమే పరుగులు పెడుతుంటాడు. ‘ మట్కా’లోనూ వాసు అలాగే కనిపిస్తున్నాడు. అయితే ఇది అనుకోకుండా జరిగిపోయింది. ఆ విషయాన్ని పెద్దగా ఆలోచించలేదు. ఈ రెండింటికీ ఏమాత్రం సంబంధం ఉండదు. పాయింట్‌ ఒకటే అయి ఉండొచ్చు కానీ స్టోరీలు వేరు. ప్రేక్షకులకు తప్పకుండా ఒక విభిన్నమైన అనుభూతిని అందిస్తాం. ‘ లక్కీభాస్కర్‌’లోలాగే ఇందులోనూ చాలా మంచి పాత్ర చేశా. మా టీమ్‌కు ఇది ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌. ఈ సినిమాతో మేము ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాం. ఇందులో నన్ను భాగం చేసుకున్నందుకు ధన్యవాదాలు. వరుణ్‌తేజ్‌ నువ్వు అద్భుతంగా యాక్ట్‌ చేశావు. వాసు పాత్రలో అదరగొట్టేశావు’’ అని మీనాక్షి చౌదరి అన్నారు.

Also Read : Mrunal Thakur : సినిమా పోస్ట్ ను ఎడిట్ చేసిన అభిమాని పై భగ్గుమన్న మృణాల్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com