Hero Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సిరుతై శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘కంగువ’ లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో దిశా పఠానీ హీరోయిన్ గా, బాబీ డియోల్ విలన్ పాత్రలో, జగపతి బాబు, యోగిబాబు, కోవై సరళ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు.
Hero Suriya Visited
దాదాపు షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమాను… ప్రపంచ వ్యాప్తంగా 38 భాషల్లో విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. కాగా ఆ సినిమా పూర్తవగానే “ఆకాశం నీ హద్దురా” ఫేమ్ సుధాకొంగర దర్శకత్వంలోనూ మరో సినిమా చేయనున్నారు. ఇటీవల సూర్య తన 44వ సినిమాను కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించనున్నారు. వీటన్నింటితో పాటు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రోలెక్స్ చిత్రం కూడా లైన్ లో ఉంది.
వరుస సినిమాలతో బీజీగా ఉండే సూర్య(Hero Suriya)… తమిళనాడులోని ఈరోడ్ జిల్లా కొడుముడియల ప్రాంతంలో గల మకుటేశ్వర ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకున్నారు. కాగా సూర్య ఆ ఆలయానికి వస్తున్న విషయం తెలియడంతో ఆ ప్రాంత ప్రజలు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో వచ్చిన సూర్యకు ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. పోలీసుల భద్రత మధ్య సూర్య చిరునవ్వులు చిందిస్తూ అందరికీ అభివాదం చేస్తూ వెళ్లారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
Also Read : Anupama Parameswaran: జానకిగా మారుతున్న అనుపమ పరమేశ్వరన్ !