Hero Suriya : సూర్య హీరోగా, చిరుత్తై శివ దర్శకత్వంలో వచ్చిన ‘కంగువా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. దీంతో సూర్య నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫోకస్ చేయనున్నాడు. ప్రస్తుతం సూర్య చేతిలో కార్తీక్ సుబ్బరాజు ప్రాజెక్ట్ తో పాటు మరో ప్రాజెక్ట్ ఉంది. ఈ క్రమంలోనే ప్రముఖ టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ సూర్య(Hero Suriya)ని ముంబైలో కలిశారు. ఆయనతో పాటు హిట్ స్ట్రీక్ నడిపిస్తున్న క్రేజీ డైరెక్టర్ కూడా ఉన్నారు. ఈ ముగ్గురి కాంబినేషన్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.
Hero Suriya Movie Updates
‘సార్’వంటి ఘన విజయం తర్వాత వెంకీ అట్లూరి-సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘లక్కీ భాస్కర్’ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మరోసారి మోక్షజ్ఞ సినిమా కోసం వెంకీ అట్లూరితో నాగవంశీ జతకట్టిన విషయం కూడా తెలిసిందే. అయితే ఈ కాంబినేషన్ ఇంకోసారి కొలాబరేట్ కానున్నారు. అదే సూర్య కొత్త సినిమా కోసం. తాజాగా ఈ ముగ్గురు ముంబైలో కలిశారు. వెంకీ అట్లూరి కథ వినిపించారు. నాగవంశీ ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధమయ్యారు. సూర్య కూడా ఆల్మోస్ట్ ఓకే చేసినట్లు తెలుస్తోంది. ‘కంగువా’ విషయానికి వస్తే.. భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా దర్శకుడు శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. నవంబర్ 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్‌కి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
Also Read : Radhika Apte : కెరీర్ పీక్స్ లో ఉండగా బిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ హాట్ బ్యూటీ