Hero Suriya: కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో పరిచయం అక్కర్లేని బ్రదర్స్ సూర్య(Suriya), కార్తీ. విలక్షణమైన నటన, విభిన్నమైన పాత్రలతో అభిమానులను మెప్పించడంతో పాటు తమ సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలకు సేవ చేయడానికి వీరు ముందుంటారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల తమిళనాడును ముంచెత్తిన మిచాంగ్ తుఫాన్ సమయంలో… తక్షణ ఆర్ధిక సహాయం క్రింద రూ. పది లక్షలు ప్రకటించారు. అంతేకాదు వరద బాధితుల ఇబ్బందులు చూసి చలించిపోయిన ఈ కోలీవుడ్ బ్రదర్స్… వరద సహాయక చర్యల్లో పాల్గొనాలంటూ అభిమానులకు పిలుపునిచ్చారు. దీనితో రంగంలోకి దిగిన సూర్య, కార్తీ అభిమానులు… మిచాంగ్ తుఫాన్ ధాటికి దెబ్బతిన్న చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్ పట్టు, కన్యాకుమారి జిల్లాల్లో సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తుఫాన్ ప్రభావం తగ్గేవరకు… అక్కడి పరిస్థితి మెరుగపడే వరకు వరద బాధితులకు సేవలు అందించారు. దీనితో కష్టకాలంలో తమ పిలుపుకు స్పందించి అభిమానులు చేసిన సేవలను గుర్తించిన సూర్య… వరద సహాయ చర్యల్లో పాల్గొన్న అభిమానులకు ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేసారు.
Hero Suriya Party Viral
చెన్నైలోని త్యాగరాయర్ నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో… చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు జిల్లాల్లో వరద సహాయక చర్యల్లో పాల్గొన్న తన అభిమానుల కోసం ప్రత్యేకంగా ఓ పార్టీను నిర్వహించారు. దీనికోసం తన అభిమానుల సంఘంలోని సభ్యులందరినీ సూర్య(Suriya) స్వయంగా ఫోన్ చేసి ఈ పార్టీకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికి శాఖాహార విందును ఏర్పాటు చేశారు. తన అభిమానులకు స్వయంగా సూర్యనే వడ్డించడం విశేషం. అలాగే వారితో కలిసి ఫోటో దిగుతూ… సూర్య తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. తన అభిమానులను సక్రమైన మార్గంలో నడిపిస్తూ… సమాజ సేవకు వారిని ఉపయోగించడం… అంతేకాదు వారిని ఇలా గౌరవించడం ద్వారా వారిలో సేవా గుణాన్ని ప్రోత్సహించడాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సూర్య… శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న అతి భారీ బడ్జెట్ సినిమా ‘కంగువా’లో నటిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 39 భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాలో సూర్య ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఐమ్యాక్స్, ఈ సినిమాలో సూర్య సరసన… బాలీవుడ్ బ్యూటీ దిశా పఠానీ నటిస్తుండగా… బాబీ డీయోల్, జగపతి బాబు, యోగిబాబు, కోవై సరళ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీనితో పాటు సుద కొంగర దర్శకత్వంలో మరో సినిమాను కూడా త్వరలో ప్రారంభించనున్నారు.
Also Read : Natasha Doshi: పెళ్ళి పీటలెక్కిన బాలకృష్ణ బ్యూటీ !