Gorre Puranam : ఇటీవల వరుస హిట్ చిత్రాలతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన సుహాస్ నటించిన మరో చిత్రం’గొర్రె పురాణం’. డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. సెప్టెంబర్ 20న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. మంచిచి కాన్సెప్ట్ కథలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్నాడు హీరో సుహాస్. కలర్ ఫోటో చిత్రంతో హీరోగా తన ప్రస్థానం మొదలు పెట్టి వరుసగా రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ప్రసన్న వధనం లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ కథలతో తెలుగు ప్రేక్షకులను అలరించి బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటుకున్నాడు. ఆ కోవలోనే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సెటైరికల్‌గా రూపొందిన చిత్రం ‘గొర్రె పురాణం(Gorre Puranam)’.
Gorre Puranam Movie OTT Updates
ఇక ఈ మూవీ స్టోరీ విషయానికిక వస్తే.. హిందూ ముస్లింల నడుమ మత ఘర్షణలు సృష్టించిందని ఏసు అనే పిలవబడే గొర్రెను జైల్లో వేస్తారు. సరిగ్గా అదే సమయంలో అదే జైల్లో ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న రవి (సుహాస్) ఆ గొర్రెకు కాపరిగా వ్యవహరిస్తుంటాడు.
ఇంతకు గొర్రె వల్ల మత కల్లోలాలు ఎందుకు చెలరేగాయి? అంతవరకు రాముగా ఉన్న గొర్రె ఏసుగా ఎందుకు మారింది, రవి జైల్లో ఎందుకు ఉన్నాడు లతని స్టోరీ ఏంటి? వంటి ప్రశ్నలకు సమాధానమే గొర్రె పురాణం(Gorre Puranam) చిత్రం. సమాజం, మీడియా, కోర్టులు, ప్రభుత్వాలు వంటి అంశాలు, వాటి పని తీరుపై వ్యంగంగా రూపొందించారు. చిత్రంలో గొర్రెకి దర్శకుడు నటుడు తరుణ్ భాస్కర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం.. మంచి కథ కథనంతో సోషల్ మెసేజ్ ఉన్న వినూత్న కథతో బాబీ దర్శకత్వంలో ఈ ‘గొర్రె పురాణం’. సినిమా తెరకెక్కగా ఫోకల్ వెంచర్స్ పతాకంపై ప్రవీణ్ రెడ్డి నిర్మించారు. సాయి పల్లవి అవ్‌స్టోరి సినిమాకు సంగీతం అందించిన పవన్ సి హెచ్ ఈ సినిమాకు సంగీతం అదించారు. కాగా ఇప్పుడు ఈ సినిమా ఆక్టోబర్ 10 (గురువారం) నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో మిస్సయిన వారు ఇప్పుడు ఇంట్లోనే ఈ సినిమాను కుంటుంబంతో కలిసి చూసేయవచ్చు.
Also Read : Game Changer Movie : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్