Sandeep Kishan : మజాకా హీరో సందీప్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోలీవుడ్ సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ నటించిన కూలీ చిత్రంపై తాను స్పందించాడు. కూలీ సినిమా తొలి 45 నిమిషాలు చూశానని, ఇది వీర లెవల్లో ఉందన్నాడు. అంతే కాదు బ్లాక్ బస్టర్ అవుతుందని, రూ. 1000 కోట్లు వసూలు చేస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.
Sandeep Kishan Comments
తాజాగా సందీప్ కిషన్(Sandeep Kishan) చేసిన కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తలైవా ఫ్యాన్స్ తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆరాధ్య దైవంగా భావించే రజనీకాంత్ ను డిఫరెంట్ గా చూపించాలని కోరుకుంటున్నారు. వారి కోరిక మేరకు తలైవాను గతంలో ఏ చిత్రంలో లేని విధంగా తెరపై ప్రజెంట్ చేసేందుకు డైరెక్టర్ ప్రయత్నం చేశాడని టాక్.
కూలీ సినిమా తన సినీ కెరీర్ లో మరిచి పోలేని మూవీ అవుతుందని స్పష్టం చేశాడు రజనీకాంత్ గురించి డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. షూటింగ్ జరుగుతున్న సమయంలో రజనీని కలుసుకున్నాడు సందీప్ కిషన్. తాను , రావు రమేష్ నటించిన మజాకా మూవీ ప్రమోషన్ లో భాగంగా కూలీ మూవీ గురించి తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు.
అయితే కూలీలో తాను నటించడం లేదన్నాడు. తాను లోకేష్ కలిసి ఓ ప్రాజెక్టు గురించి చర్చిస్తున్నామని చెప్పాడు. ఇక కూలీ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఓ పాత్రలో నటిస్తుండడం విశేషం.
Also Read : Shabana Azmi Interesting :డబ్బా కార్టెల్ లో అందుకే నటించా