Hero Ravi Teja: హీరో రవితేజకు సర్జరీ ! ఆరు వారాల పాటు విశ్రాంతి !

హీరో రవితేజకు సర్జరీ ! ఆరు వారాల పాటు విశ్రాంతి !

Hello Telugu - Hero Ravi Teja

Hero Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ హాస్పిటల్ ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న రవితేజ 75 వ సినిమా షూటింగ్ లో ప్రమాదానికి గురై యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నట్లు ఉన్న ఈ ఫోటోను చూసి రవితేజ అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే కంగారు పడాల్సిన అవసరం లేదని డాక్టర్స్ చెబుతున్నారు. RT75 మూవీ సెట్స్‌లో జరిగిన ప్రమాదంలో రవితేజ కుడిచేతికి అయిన గాయానికి హైదరాబాద్‌లోని హాస్పిటల్‌లో సర్జరీ చేశారు. డాక్టర్స్ ఆరు వారాల పాటు రవితేజకు బెడ్ రెస్ట్ సూచించారు.

Hero Ravi Teja Health..

మాస్ మహారాజ్ రవితేజ(Hero Ravi Teja) కుడి చేతికి గాయం కావడంతో కొన్ని రోజుల క్రితం శస్త్ర చికిత్స జరిగింది. ఇటీవల తన 75వ సినిమా చిత్రీకరణలో ఉండగా మళ్లీ ఆ నొప్పి తిరగబెట్టింది. రవితేజని గాయాన్ని పరిశీలించిన డాక్టర్స్.. వెంటనే ఆయనకు సర్జరీ చేయాలని చెప్పి.. అందుకు తగిన ఏర్పాట్లను చేశారు. ప్రస్తుతం రవితేజకు సర్జరీ పూర్తయింది. గత కొన్ని రోజులుగా ఆయన విశ్రాంతి లేకుండా షూటింగ్స్ చేస్తుండటంతో పాటు, ఇప్పుడీ సర్జరీ.. మొత్తంగా ఆయనకు ఆరు వారాల పాటు బెడ్ రెస్ట్ అవసరమని డాక్టర్స్ సూచించారని తెలుస్తోంది. ఆయన శుక్రవారం చికిత్స పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లారు.

RT75 వర్కింగ్ టైటిల్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర‌ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ఇందులో రవితేజ సరసన మరోసారి శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక రవితేజ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం భారీ అంచనాలతో ఇటీవల థియేటర్లలోకి వచ్చి మిక్స్‌డ్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

Also Read : Prabhas-Imanvi : ప్రభాస్ కి జోడిగా నటించనున్న ‘ఇమాన్వి’ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com