Hero Ravi Teja: మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కావ్యా థాపర్, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమాను తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ‘ఈగల్’ ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకోగా… ‘ఆడు మచ్చా’, ‘గల్లంతే’ అనే రెండు పాటలు కూడా ట్రెండింగ్ లో ఉన్నాయి. దీనితో నూతన సంవత్సర కానుకగా చిత్ర యూనిట్ ఓ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసారు.
Hero Ravi Teja Eagle Movie Updates
‘‘యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో రవితేజని(Hero Ravi Teja)… దర్శకుడు కార్తీక్ పవర్‌ఫుల్ పాత్రలో సరికొత్తగా చూపించబోతున్నారని… ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. ‘‘2024 ఉషోదయం మీకు ఆశీర్వాదాలు, విజయాలతో పాటు మరపురాని జ్ఞాపకాలను ఇస్తుంది. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు’’ అంటూ ‘ఈగల్’ కి సంబంధించిన ఓ కొత్త పోస్టర్ ను రవితేజ తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.
Also Read : Mrunal Thakur: కోలీవుడ్ లో అడుపెడుతున్న ‘సీతారామం’ బ్యూటీ !