Hero Rajinikanth : చెక్ బౌన్స్ కేసులో డైరెక్టర్ లింగ స్వామికి ఫోన్ చేసి సాయం చేసిన తలైవా

ఈ విషయం తెలుసుకున్న రజనీకాంత్ స్వయంగా లింగుస్వామి కి ఫోన్‌ చేసి.....

Hello Telugu - Hero Rajinikanth

Hero Rajinikanth : ర‌న్‌, పందెంకోడి వంటి సినిమాల‌తో అల‌రించి తెలుగులో గ‌త సంవ‌త్స‌రం రామ్‌ వారియ‌ర్ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన డైరెక్ట‌ర్ లింగుస్వామికి చెక్‌ బౌన్స్‌ కేసులో కోర్టు ఆరు నెలల జైలుశిక్ష విధించింది. ఈ విషయం తెలుసుకున్న సూపర్‌ స్టార్‌ రజనీకాంత్(Hero Rajinikanth) స్వయంగా లింగుస్వామికి ఫోన్‌ చేసి.. ‘నేను ఏదైనా చేసేదా? అంటూ అడిగారు. ఈ విషయాన్ని లింగుస్వామి తాజాగా వెల్లడించారు. విష‌యానికి వ‌స్తే.. గతంలో లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన ‘ఉత్తమ విలన్‌’ డిజాస్టర్‌ ఫ్లాప్‌ సొంతం చేసుకుంది. దీంతో ఆయన ఆర్థికంగా నష్టపోయారు. ఆ తర్వాత ‘ఇడమ్‌ పొరుల్‌ ఏవల్‌’ అనే సినిమాను లింగుస్వామి తెరకెక్కించారు. అయితే, పీవీపీకి, తిరుపతి బ్రదర్స్‌కు మధ్య ఆర్థిక వివాదం కేసు జరుగుతుంది. పీవీపీ సంస్థ నుంచి తీసుకున్న రుణం తిరిగి చెల్లించే నిమిత్తం ఆ సంస్థకు లింగుస్వామి ఇచ్చిన చెక్కు బౌన్స్‌ అయింది. ఈ వ్యవహరంలో సైదాపేట కోర్టు లింగుస్వామికి ఆరు నెలల జైలుశిక్ష విధించింది. దీన్ని హైకోర్టులో సవాల్‌ చేయగా అక్కడ కూడా చుక్కెదురైంది.

Hero Rajinikanth Comment

ఈ విషయం తెలుసుకున్న రజనీకాంత్ స్వయంగా లింగుస్వామి కి ఫోన్‌ చేసి… ‘నేను ఏమైనా చేయనా? సమస్య ఏంటి? ఎంత మొత్తం ఉంటుంది’ అంటూ ఆరా తీశారు. ఆ సమయంలో నేను ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. విచారించడంలో తప్పులేదు. కానీ, ఆ మొత్తం ఎంతో చెప్తే సెటిల్‌ చేసేద్దాం అని తలైవర్‌ చెప్పడం జీవితంలో మరచిపోలేని విషయం అని లింగుస్వామి తాజాగా వెల్లడించారు.

Also Read : Hero Chiranjeevi : సీతారాం ఏచూరి మరణం చాలా బాధాకరం

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com