Hero Raj Tarun : నాపై లావణ్య చేసినవని ఆరోపణలు మాత్రమే, ఇంతవరకు ఎలాంటి ఆధారాలు చూపించలేదని అన్నారు యంగ్ హీరో రాజ్ తరుణ్(Hero Raj Tarun). మగవాళ్లపై తప్పుడు కేసులు పెట్టే మహిళలున్నారు.. నాపై కూడా తప్పుడు కేసులు పెట్టారు అని తాజాగా ఆయన హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన ‘తిరగబడరసామీ’ మూవీకి సంబంధించి జరిగిన వేడుకలో మీడియాకు చెప్పారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. ‘‘నాపై లావణ్య చేసినవని ఆరోపణలు మాత్రమే, ఆధారాలు చూపించలేదు. లావణ్య నాపై ఆరోపణలు చేసినప్పుడు మీడియా ఎందుకు ఆమెను ఆధారాలు అడగలేదు. నాకు భయపడాల్సిన అవసరం లేదు.. నా దగ్గర అన్ని ఆధారాలున్నాయి. నేను లీగల్‌గా వెళ్తున్నాను. లావణ్య పెట్టిన ఎఫ్ఐఆర్‌లో గర్భస్రావంపై కేసు ఎందుకు లేదు? నేనేం తప్పించుకొని తిరగలేదు. పోలీసులు నాకు నోటీసులిచ్చారు, నేను స్పందించాను.
Hero Raj Tarun Comment
నాలో ఉన్న అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకుంటున్నారు. నేను ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. నేను మనిషినే, నాకు బాధగా ఉంటుంది. ఆ బాధతోనే ‘పురుషోత్తముడు’ సినిమా సమయంలో బయటికి రాలేదు. నాకు పెళ్లంటే చాలా భయం. నాకు జీవితంలో పెళ్లిపై ఆసక్తి లేదు. నా 32 ఏళ్ల వయస్సులో చిత్ర పరిశ్రమలో ఎంతో మందితో సాన్నిహిత్యం ఉంది. నేను మంచి వాడిని కాదు అని ఇండస్ట్రీలో ఎవరైనా చెబితే నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోతాను. లావణ్య ఆరోపణలతో నేను మాత్రమే కాదు నా కుటుంబం కూడా ఎంతో బాధపడింది. మగవాళ్లపై తప్పుడు కేసులు పెట్టే మహిళలున్నారు. నాపై కూడా అలాగే తప్పుడు కేసులు పెట్టారు. నాపై వచ్చిన ఆరోపణలపై భయంతోనే నేను ఇన్ని రోజులు బయటకి రాలేదు’’ అని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చారు.
అయితే రాజ్ తరుణ్(Hero Raj Tarun) చెప్పేవన్నీ అబద్దాలే అంటూ లావణ్య కూడా ఇదే వేడుక వద్ద హంగామా చేశారు. మూవీ ప్రమోషన్‌కి వచ్చిన రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వీ మల్హోత్రాను ఆమె అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో లావణ్యను పోలీసులు అడ్డుకున్నారు. అసలు విషయం ఏమిటంటే.. ‘‘పదకొండేళ్లగా రాజ్ తరుణ్ నాతో ఉంటున్నాడు. ఏడేళ్లు ఇద్దరం కలిసి సంసారం చేశాం. అతనంటే నాకు ప్రాణం. అతనిప్పుడు నన్ను వదిలేసి మాల్వీ మల్హోత్రాతో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు.. నా రాజ్ నాకు కావాలి’’ అంటూ లావణ్య మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రాజ్‌తరుణ్ తనను ప్రేమించాడనీ పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మోసం చేశాడని ఇటీవల ఆమె నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై రాజ్ తరుణ్(Hero Raj Tarun) కూడా స్పందించాడు. రిలేషన్‌లో ఉన్న మాట నిజమేనని, కొన్ని కారణాల వల్ల ఆమెకు దూరంగా ఉన్నాననీ, కొంతకాలంగా టార్చర్ చేస్తుందని మీడియాకు తెలిపారు రాజ్ తరుణ్. ఇలా మొదలైన ఈ ఇష్యూ ట్విస్ట్‌లతో ఓ టీవీ సీరియల్‌లా కొనసాగుతూనే ఉంది.
Also Read : Gaddar Awards: ‘గద్దర్ అవార్డ్స్’పై స్పందించిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ! చిరంజీవి పోస్ట్ ఎఫెక్ట్ ?