Hero Priyadarshi: జాతకాలు చెప్పడానికి సిద్ధమౌతోన్న టాలీవుడ్ యంగ్ హీరో !

జాతకాలు చెప్పడానికి సిద్ధమౌతోన్న టాలీవుడ్ యంగ్ హీరో !

Hello Telugu - Hero Priyadarshi

Hero Priyadarshi: డార్లింగ్ మూవీతో ఇటీవలే ప్రేక్షకులను మెప్పించారు టాలీవుడ్ యంగ్ హీరో ప్రియదర్శి పులికొండ. నభా నటేశ్‌ హీరోయిన్‌ గా నటించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ ను సొంతం చేసుకుంది. తాజాగా మరో కొత్త సినిమాకు రెడీ అయిపోయాడు ప్రియదర్శి. రూప కొడువాయూర్‌ తో కలిసి ‘సారంగపాణి జాతకం’ అనే సినిమాలో నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీని ఫుల్ కామెడీ ఎంటర్‌ టైనర్‌ గా ప్రముఖ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కిస్తున్నారు.

Hero Priyadarshi…

ఆదివారం ప్రియదర్శి(Hero Priyadarshi) బర్త్‌ డే కావడంతో ‘సారంగపాణి జాతకం’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌తో పాటు టైటిల్‌ రివీల్‌ చేశారు. తాజాగా విడుదలైన పోస్టర్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పోస్టర్ చూస్తుంటే థియేటర్లలో నవ్వులు పూయిచండం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

ఈ సందర్భంగా దర్శకుడు ఇంద్రగంటి మాట్లాడుతూ… ‘నమ్మకం మనిషికి బలాన్ని ఇస్తుంది. కానీ మూఢ నమ్మకం బుద్ధిమంతుడిని కూడా బలహీనుడిని చేసి నవ్వుల పాలు చేస్తుంది. అలా నవ్వుల పాలైన ఓ మధ్య తరగతి మంచి అబ్బాయి కథే ‘సారంగపాణి జాతకం’. తన నమ్మకం, తను ఇష్టపడిన అమ్మాయి ప్రేమ మధ్య కొట్టుమిట్టాడిపోయాడా ? లేదా బయట పడ్డాడా? అనే కథాంశంతో ఉత్కంఠభరితంగా పొట్ట చెక్కలయ్యేలా నవ్వించే హాస్య చిత్రమని’ అన్నారు.

Also Read : Vijay Devarakaonda: ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాకు ఏడేళ్ళు ! సినిమాపై విజయ్ దేవరకొండ ఆశక్తికర పోస్ట్ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com