Prabhas : ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే ప్రభాస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ మధ్య కాలంలో ఆయన అభిమానులు సినిమాలకంటే పెళ్లి కోసమే ఎక్కువ ఎదురు చూస్తున్నారు. ప్రభాస్(Prabhas), ప్రభాస్ ఫ్యామిలీ, ప్రభాస్ స్నేహితులు ఎవరైనా.. ఎక్కడ కనిపించిన, ఏ వేదికపై కనిపించిన ప్రభాస్ పెళ్లి గురించే ప్రశ్నలు ఎదురవుతుంటాయి. గతేడాది ప్రభాస్.. బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ షోకు వచ్చినప్పుడు ఇదే ప్రశ్న ఎదురైంది. తాజాగా ఈ షోకు ప్రభాస్ స్నేహితుడు ‘గేమ్ ఛేంజర్’ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హాజరైన విషయం తెలిసిందే.
Hero Prabhas Marriage Updates
‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రమోషన్స్ కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan).. బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ షోలో ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకున్నాడు. బాలయ్య.. ప్రభాస్ పెళ్లి గురించి ప్రస్తావన తీసుకురాగా ప్రభాస్ ఫ్యాన్స్ నోట్లో చక్కర పోసినంత గుడ్ న్యూస్ చెప్పినట్లు సమాచారం. అవును.. షోలో ప్రభాస్ ఏ ఊరి అమ్మాయిని పెళ్లి చేసుకోనున్నాడో చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ అమ్మాయి ఎవరో కాదు.. పదహారు అణాల తెలుగు అమ్మాయి. వెస్ట్ గోదావరి జిల్లా గణపవరంకు చెందిన అమ్మాయి అని చరణ్ వెల్లడించినట్లు సమాచారం. దీంతో ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. కాగా, ప్రభాస్ ఫ్యాన్స్ ఈ వార్త నిజం కావాలని గట్టిగా కోరుకుంటున్నారు. తీవ్రమైన సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు.
గతేడాదిదసరా వేడుకల్లో విజయవాడ కనకదుర్గమ్మని దర్శించుకున్న ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు భార్య శ్యామల దేవిని మీడియా పెళ్లి గృయించి అడగగా ఆమె సమాధానమిస్తూ.. “దీర్ఘ కాలం నుండి వేచి చూస్తున్న పెళ్ళికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ త్వరలోనే ఉండబోతుంది. పైనున్న కృష్ణం రాజు గారు అన్ని సవ్యంగా చూసుకుంటారు. ఇప్పటి వరకు అనుకున్నావని అనుకున్నట్లే అయ్యాయి. మా కుటుంబం మొత్తం ప్రభాస్ ఎప్పుడెప్పుడు ఒక ఇంటి వాడవుతాడా అంటూ వెయిట్ చేస్తున్నాము” అన్నారు. దీంతో ప్రభాస్ కళ్యాణ ఘడియలు దగ్గర పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ ‘సలార్ 2’, ‘కల్కి 2’, ‘ది రాజా సాబ్’, ‘స్పిరిట్’, ‘ఫౌజి’ వంటి సినిమాలతో పాటు హోంబలే ఫిల్మ్స్‌లో ఇప్పుడు చేస్తున్న ‘సలార్ 2’ కాకుండా మరో రెండు సినిమాలకు సైన్ చేశాడు.
Also Read : National Crush Rashmika : నేషనల్ క్రష్ రష్మిక ఆరోగ్యంపై కీలక అప్డేట్