Prabhas : టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా చర్చకు వచ్చే అంశం ఏదైనా ఉందీ అంటే అది ఖచ్చితంగా ప్రభాస్ పెళ్లి గురించే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పెళ్లి కోసం ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ సినీ ఇండస్ట్రీ వేచి చూస్తుంది. ఎందుకంటే, ప్రభాస్ ఎవరిని, ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఎప్పుడు వివాహబంధంలోకి అడుగుపెడతారు? అని అందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే, అంతా ప్రభాస్ పెళ్లి చూడాలని అంతగా ఆశపడుతుంటే.. పెళ్లి విషయంలో ప్రభాస్(Prabhas) ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నట్లుగా తాజాగా ఆయన పాల్గొన్న ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలే చెబుతున్నాయి.
Prabhas Comment
‘ఇప్పుడునేను పెళ్లి చేసుకోవాలా.. చేసుకోకూడదా?’ అని ప్రభాస్(Prabhas) అన్నారంటే.. అందులో ఏదో మ్యాటర్ ఉండే ఉంటుంది కదా.. అయితే ఇదేదో సీరియస్ మ్యాటర్ అనుకుంటున్నారేమో.. అలాంటిదేమీ లేదు. అసలు ప్రభాస్ ఎందుకు ఇలా అన్నారంటే.. తాజాగా ఆయన ఈటీవీలో ప్రసారమవుతోన్న సిరివెన్నెల ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. ఇందులో సీతారామశాస్త్రి రాసిన పెళ్లి పాటల ప్రస్తావన వచ్చింది. ‘మనీ’ అనే సినిమా కోసం ఆయన ‘భద్రం బీకేర్‌ఫుల్ బ్రదర్.. భర్తగా మారకు బ్యాచ్‌లర్’ అనే పాట రాశారు. అంటే ఈ పాటలో శాస్త్రిగారు పెళ్లి చేసుకోవద్దని చెప్పారు. ఆ తర్వాత చాలా సినిమాలలో పెళ్లి గురించి చాలా గొప్పగా చెప్పారు. ఆయన పాటలు విన్న తర్వాత కన్ఫ్యూజన్లో పడిపోయా. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలా? చేసుకోకూడదా? అంటూ సరదాగా చమత్కరించారు ప్రభాస్.
ఇంకాఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘జల్సా’ సినిమాలో ‘చలోరే చలోరే చల్’ అనే పాట తనకు ఎంత ఇష్టమో, ఆ పాటతో తన ఫ్రెండ్స్‌ని ఎంతగా ఇబ్బంది పెట్టేవాడో కూడా ప్రభాస్ చెప్పుకొచ్చారు. ఈ పాటలోని ‘రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎపుడో సొంత ముఖం’ అనే లైన్ తనకి ఎంత ఇష్టమో చెప్పలేనంటూ.. ఇది మన లైఫ్ స్టైల్ కోసం శాస్త్రిగారు రాసినట్లు ఉంటుందని ప్రభాస్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మాధ్యమాలలో బాగా వైరల్ అవుతోంది. ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. ‘సలార్ 2’, ‘కల్కి 2’, ‘ది రాజా సాబ్’, ‘స్పిరిట్’, ‘ఫౌజి’ వంటి సినిమాలతో పాటు హోంబలే ఫిల్మ్స్‌లో ఇప్పుడు చేస్తున్న ‘సలార్ 2’ కాకుండా మరో రెండు సినిమాలకు ఆయన సైన్ చేశారు.
Also Read : Devaki Nandana Vasudeva : ‘దేవకీ నందన వాసుదేవ’ సినిమా ట్రైలర్ పై కీలక అప్డేట్