Hero Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు గాయాలయ్యాయని, దాని వల్ల వచ్చే నెల జపాన్‌లో విడుదల కానున్న కల్కి ప్రమోషన్స్‌కు హాజరు కాలేకపోతున్నానంటూ ఓ నోట్ నెట్టింట వైరల్ అవుతుంది. అయితే ఆయన కాలి చీలమండ కాస్త బెణికిందని దాని వల్ల ప్రమోషన్ కార్యక్రమాలు క్యాన్సిల్ చేసినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. వచ్చే నెల 3న ఆయన ‘కల్కి’ రిలీజ్ ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లాల్సి ఉంది.కాలికి సమస్య రావడంతో ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకున్నారు. డిస్ర్టిబ్యూటర్ల టీమ్ జపాన్ ప్రమోషన్స్‌లో పాల్గొంటుందని తెలిపారు.
Hero Prabhas Accident
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రెండు చిత్రాలు సెట్స్ మీదున్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫౌజీ’ షూటింగ్ జరుగుతోంది. డ్రాగన్ ప్రకాశ్ ఆధ్వర్యంలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అయితే రెండ్రోజులుగా ఆ సినిమా షూటింగ్ జరగట్లేదని తెలిసింది. మరో చోట రాజాసాబ్ చిత్రీకరణ జరుగుతోంది. అయితే రామ్-లక్ష్మణ్‌ల నేతృత్వంలో ‘రాజాసాబ్’ లో హీరోలేని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అయితే ఆయనకు ఏ షూటింగ్‌లో గాయమైందనేది తెలియాల్సి ఉంది.
Also Read : Allu Arjun : శ్రీ తేజ ను కలవలేక పోతున్న అంటూ భావోద్వేగ ట్వీట్ చేసిన బన్నీ