Prabhas : ప్రస్తుతం దేశమంతా సగర్వంగా పేరు చెప్పుకుంటున్న నటుడు మన రెబల్ స్టార్ ప్రభాస్. వరుసగా విజయవంతమైన చిత్రాలను చేస్తూ రోజురోజుకు తన స్థాయిని మరింతగా పెంచుకుంటూ పోతున్నాడు. ఈ రోజు ప్రభాస్ జన్మదినం సందర్భంగా ప్రంచవ్యాప్తంగా ఆయన అభిమానులు అంబరాన్నంటేలా బర్త్‌డే సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా సేవాగుణం, మానవత్వంలోనూ తనకు మరొకరు సాటి రాని విధంగా పేరు దక్కించుకుంటు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. బాహుబలి విజయంతో కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకున్న ప్రభాస్(Prabhas) నేడు దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా ఎదిగాడు.
Prabhas…
హీరోగా అంతకముందు నుంచి ఉన్నప్పటికీ, ప్రభాస్(Prabhas) ను స్టార్ చేసి ప్రపంచ స్థాయిలో నిలబెట్టింది బాహుబలి చిత్రం. అవడానికి టాలీవుడ్ నటుడు అయినా బాలీవుడ్ ఖాన్ లను మించిన క్రేజ్ ఇప్పుడతని సొంతం. గత పదేళ్ల కాలంలో ప్రభాస్ నేమ్ ఫేమ్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూ వస్తొంది. పాన్ ఇండియా వైడ్ నటుడిగా ఎంతో క్రేజ్ సంపాదించుకోవడంతో పాటు వ్యకిగతంగా ఆస్తుల విలువ కూడా బాగా పెరిగింది. లగర్జీయస్ లైఫ్ స్టయిల్‌తో పాటు ఖరీదైన ఇళ్లు మరియు కార్ల వరకు, ప్రభాస్ యొక్క నెట్ వర్త్ ఇప్పుడు టాక్ ఆఫ్ టాలీవుడ్‌గా మారడమే గాక ఫోర్బ్స్ ఇండియా యొక్క సెలబ్రిటీల జాబితాలో ప్రభాస్ ప్లేస్ సంపాదించుకోవడం విశేషం.
2024కు వచ్చేసరికి ప్రభాస్ నికర ఆస్తుల విలువ 300 కోట్లకు పైగానే ఉన్నాయి. నటుడిగా, ప్రభాస్‌కు ప్రధాన ఆదాయ వనరు సినిమాలే. రెమ్యూనరేషన్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని స్దిరాస్తుల కోనుగోలుతో పాటు, తన స్నేహితులతో కలిసి సినిమాల నిర్మాణంలోనూ ఇన్వెస్ట్ చేస్తుంటారు. 100 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్న తొలి హీరోగా ప్రభాస్ ప్రచారంలో ఉన్నాడు. ఇప్పుడు ప్రభాస్ రెమ్యూనిరేషన్ 150 కోట్లు పైమాటే అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పాష్ ఏరియాలో విలాసవంతమైన ఇంట్లో ప్రభాస్(Prabhas) నివాసం ఉంటుండగా ఆ ఇంట్లో విలాసవంతమైన ఇంటీరియర్స్‌తో పాటు ఇంట్లో ఇండోర్ స్విమ్మింగ్ పూల్, గార్డెన్ మరియు హై-ఎండ్ జిమ్ ఉన్నాయి. ముఖ్యంగా జిమ్‌లో 1.5 కోట్ల విలువైన పరికరాలు ఉండడం ఓ హైలెట్. అదేవిధంగా 84 ఎకరాల్లో ఫామ్ హౌస్, ముంబైలో మరో ఇల్లు ప్రభాస్ సొంతం. ఇటీవలే ప్రభాస్ యూరప్‌లో ఓఇంటిని నెలకు రూ.40 లక్షలతో రెంట్‌కు తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. ఇక ప్రభాస్ గ్యారేజీలో లగ్జరీ కార్ల కలెక్షన్ ఎక్కువగానే ఉంది. 1 కోటి విలువైన రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కార్, 60 లక్షల విలువైన ఆడి ఎ6 కార్, 2 కోట్ల విలువైన బిఎండబ్యు 7 సిరీస్ కారు, 2 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ కారు, 1 కోటి విలువైన జాగ్వార్ ఎక్స్ జె ఎసల్ పోర్ట్‌ఫోలియో కారు, 3.5 కోట్ల విలువైన లంబోర్గిని అవెంటడార్ కారు, 8 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ కార్లు ఉన్నాయి.
Also Read : Nithya Menen : తనపై వస్తున్న విమర్శలపై స్పందించిన నిత్యామీనన్