Hero NTR : ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేసిన ఘనత కన్నడ సినీ రంగానికి చెందిన ప్రశాంత్ నీల్ కు దక్కుతుంది. సూపర్ స్టార్ యశ్ తో తను తీసిన కేజీఎఫ్ చరిత్ర సృష్టించింది. రికార్డుల మోత మోగించింది. సీక్వెల్ గా తీసినా అది కూడా హిట్ అయ్యింది. యశ్ తో తీశాక డార్లింగ్ ప్రభాస్ తో సినిమా తీశాడు . బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ హీరో జూనియర్ ఎన్టీఆర్(Hero NTR) తో మరో మూవీ కోసం ప్లాన్ చేశాడు. ఇది కూడా కన్ ఫర్మ్ అయ్యింది.
Hero NTR-Prasanth Neel Movie…
ఇందులో తారక్ కీ రోల్ పోషిస్తుండగా ఇతర పాత్రలకు సంబంధించి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు దర్శకుడు నీల్. ఈ మూవీకి సంబంధించి తాజా అప్ డేట్ వచ్చింది. వచ్చే ఫిబ్రవరి నెలలో ఇంకా పేరు పెట్టని సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలని షెడ్యూల్ కూడా ఖరారు చేశాడు ప్రశాంత్ నీల్.
పూర్తిగా యాక్షన్, థ్రిల్లర్ , యాక్టర్ కు ప్రయారిటీ ఇచ్చే దమ్మున్న డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు కన్నడ స్టార్ డైరెక్టర్. తనే కథ, డైలాగులు, స్క్రీన్ ప్లే అంతా చూసుకుంటాడు. ఇది తన ప్రత్యేకత. ఎక్కడా భేషజాలకు పోకుండా తన పనేదో తాను చేసుకునే మనస్తత్వం ప్రశాంత్ నీల్ ది. సినిమానే లోకం..సినిమానే తన గమ్యం అన్నట్టుగా ఉంటుంది. ఇక ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తనకు ఏ పాత్ర ఇచ్చినా దానికి 100 శాతం న్యాయం చేసే సత్తా తారక్ కు ఉంది.
ఇక ఈ ఇద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందోననే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే మూవీకి డ్రాగన్ అని పేరు కూడా పెట్టినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
Also Read : Hero Prithviraj-SSMB29 : జక్కన్న మూవీలో సుకుమారన్