Hero Nikhil : మగ బిడ్డకు జన్మనిచ్చిన హీరో నిఖిల్ భార్య..వైరల్ అవుతున్న ఫోటోలు

తాజాగా నిఖిల్ తన భార్య ప్రెగ్నెన్సీ గురించి అందరికి తెలియజేశాడు

Hello Telugu - Hero Nikhil

Hero Nikhil : టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఓ శుభవార్త అందించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తను తండ్రిగా ప్రమోషన్‌ను పొందినట్టు ప్రకటించారు. తన భార్య పల్లవి బుధవారం (ఫిబ్రవరి 21) మగబిడ్డకు జన్మనిచ్చిందని ప్రకటించారు. నిఖిల్ తన కొడుకును పట్టుకుని ముద్దుపెట్టుకుంటున్న ఫోటో వైరల్‌గా మారింది. నిఖిల్ పల్లవి దంపతులకు పలువురు సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు అభినందనలు తెలియజేస్తున్నారు. 2020లో నిఖిల్-పల్లవి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ పెళ్లి కాకముందే ప్రేమించుకున్నారు, పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్నారు. కొరోనా సమయంలో వీరిద్దరి వివాహం జరిగింది, కొద్ది సంఖ్యలో సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.

తాజాగా నిఖిల్ తన భార్య ప్రెగ్నెన్సీ గురించి అందరికి తెలియజేశాడు. అలాగే తన సతీమణి సీమంతం వేడుకను కుటుంబసభ్యుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు పల్లవి పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో నిఖిల్(Nikhil) ఆనందానికి అవధులు లేవు.

Hero Nikhil Welcomes

సినిమాల విషయానికొస్తే. కార్తికేయ 2తో నిఖిల్ పాన్-ఇండియన్ హీరోగా మారాడు. తర్వాత 18 పేజీస్, స్పై ఓకే అనిపించాయి. ఈ యువ హీరో స్వయంభూ అనే మరో పాన్-ఇండియన్ చిత్రంతో మళ్లీ మన ముందుకు వస్తున్నాడు. ఈ చారిత్రాత్మక చిత్రంలో నిఖిల్ యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం నిఖిల్ దాదాపు మూడు నెలల పాటు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నాడు. ఈ సినిమా కోసం తన లుక్ కూడా పూర్తిగా మార్చుకున్నాడు.

Also Read : Varun Sandesh: వైరల్ అవుతున్న వ‌రుణ్ సందేశ్‌, వితికా గృహ‌ప్ర‌వేశం వీడియో !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com