Hero Nikhil : కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో నిఖిల్

కాగాకార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు నిఖిల్...

Hello Telugu - Hero Nikhil

Hero Nikhil : టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. శనివారం (నవంబర్ 10) ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొన్నాడు. నిఖిల్(Hero Nikhil) వెంట ఆయన భార్య, మామా, చీరల ఎమ్మెల్యే కొండయ్య తదితరులు ఉన్నారు. ఆలయాధికారులు వీరికి సాదర స్వాగత పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఇక దర్శనానంతరం బయటకు వచ్చిన నిఖిల్ ను చూసిన భక్తులు, అభిమానులు అతనితో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. నిఖిల్ కూడా ఎంతో ఓపికతో అడిగిన వారందరితో ఫొటోలు, సెల్ఫీలు దిగాడు. ప్రస్తుతం నిఖిల్ తిరుమల పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి.

Hero Nikhil Visited

కాగాకార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు నిఖిల్. ఆ తర్వాత వచ్చిన 18 పేజెస్, స్పై సినిమాలు కూడా ఓ మోస్తరు విజయం సాధించాయి. ఇప్పుడు ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అని రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీతో మన ముందుకు వచ్చాడు. నవంబర్ 8న విడుదలైన ఈ సినిమా యూత్ ను బాగా ఆకట్టుకుంటోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించింది. దివ్యాంశ్ కౌశిక్ సెకెండ్ హీరోయిన్ గా మెప్పించింది. కాగా కార్తికేయ 2 తర్వాత స్వయంభు పేరుతో మరో పాన్ ఇండియా మూవీతో మన ముందుకు వస్తున్నాడీ యంగ్ హీరో. చారిత్రాత్మక నేపథ్యంలో సాగే ఈ మూవీలో నిఖిల్ వారియర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం దాదాపు మూడు నెలలపాటు యుద్ధవిద్యలపైనే నిఖిల్ శిక్షణ తీసుకున్నాడు. అంతేకాకుండా ఈ సినిమా కోసం తన లుక్ పూర్తిగా మార్చేశాడు.

Also Read : Bunny-Rashmika : పుష్ప 2 రిలీజ్ కు ముందే బన్నీకి స్పెషల్ గిఫ్ట్ పంపిన రష్మిక

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com