హైదరాబాద్ – టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. 2017లో ఒకసారి ఈ కేసు వెలుగు చూసింది. ఆ తర్వాత అప్పుడప్పుడూ ప్రచారం జరగడం, ఆ తర్వాత సమిసి పోవడం జరుగుతోంది. దీంతో పిల్లి ఎలుక ఆట లాగా డ్రగ్స్ కేసు తయారైందన్న విమర్శలు లేక పోలేదు.
తాజాగా మాదాపూర్ లో నార్కోటిక్ బృందం జరిపిన దాడుల్లో పట్టుబడ్డారు. వారిలో ఓ నిర్మాత, మోడల్ కూడా పరారయ్యారు. ఇక్కడ పబ్ నిర్వహిస్తున్నది ఎవరో కాదు ప్రముఖ నటుడు నవదీప్. ఈ విషయాన్ని స్వయంగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మీడియా సాక్షిగా వెల్లడించారు.
ఇదే సమయంలో నిర్మాత, మోడల్ తో పాటు నటుడు నవదీప్ జంప్ అయ్యాడని ప్రకటించారు. వాళ్లు ఎక్కడ ఉన్నా పట్టుకుని తీరుతామని హెచ్చరించారు సీపీ. ఇదే సమయంలో తాను ఎక్కడికీ పారి పోలేదంటూ సంచలన ప్రకటన చేశారు నటుడు నవదీప్.
దీంతో పోలీసులు వెల్లడించిన నోట్ లో నవదీప్ పేరు కూడా ఉంది. దీనికి సంబంధించి నోటీసులు కూడా జారీ చేస్తామని స్పష్టం చేశారు సీపీ సీవీ ఆనంద్. ఇదిలా ఉండగా తనను అరెస్ట్ చేయకుండా తప్పించు కునేందుకు మనోడు ఎత్తుకు పై ఎత్తు వేశాడు. ఇంకేం తనను ముందస్తు అదుపులోకి తీసుకోవద్దంటూ కోర్టును ఆశ్రయించాడు. దీంతో కోర్టు అనుకూలంగా స్టే విధించింది.
మంగళవారం ఊహించని రీతిలో పోలీసులు షాక్ ఇచ్చారు. నటుడు నవదీప్ ఇంట్లో సోదాలు చేపట్టారు. ఏం దొరికాయనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.