Hero Nani : తిరుమల వెంకన్న ఎంతో పవర్‌ఫుల్. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు, మొక్కులు చెల్లించుకునేందుకు నిత్యం వేలమంది భక్తులు తిరుమల కొండకు వస్తుంటారు. అందుకు సినిమా సెలబ్రిటీలు కూడా మినహాయింపు కాదు. పౌత్‌కి చెందిన ఎంతోమంది సెలబ్రిటీలు.. కొండకు కాలినడకన వెళ్లి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. తాజాాగా ఓ టాలీవుడ్ హీరో కూడా అలిపిరి నుంచి కాలినడకన తిరుమల చేరుకున్నారు.
Hero Nani Visited
అయితే ఆయన మాస్క్ పెట్టుకుని ఉండటంతో తొలుత ఎవరూ గుర్తుపట్టలేదు. దారిలో ఓసారి మాస్క్ తీసివేయడంతో.. భక్తులు గుర్తుపట్టి సెల్పీల కోసం ఎగబడ్డారు. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు. నేచురల్ స్టార్ నాని. అవును.. నాని.. అలిపిరి నుంచి కాలినడకన తిరుమల చేరుకున్నారు. భార్య, కొడుకుతో కలిసి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. నడకమార్గంలో నానితో ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు భక్తులు. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు నాని. ఆయన తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’ ఈ నెల 29న విడుదల కానుంది. తన నుంచి వైవిధ్యమైన సినిమాలను కోరుకునే ప్రేక్షకుల కోసం సరిపోదా శనివారం మూవీని చేసినట్లు నాని తెలిపారు.
Also Read : Telangana Police : పిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తామంటూ వార్నింగ్ ఇచ్చిన తెలంగాణ పోలీసులు