Hero Nagarjuna : నాగచైతన్య సమంత విడాకులపై కీలక అంశాలు వెల్లడించిన నాగ్

విడాకుల అనంతరం నాగ చైతన్య డిప్రెషన్‌లోకి వెళ్లాడు...

Hello Telugu - Hero Nagarjuna

Hero Nagarjuna : గురువారం ఉదయం 9.42 గంటలకు నాగచైతన్య, శోభితా ధూళిపాళ నిశ్చితార్థం జరిగిందని ఎక్స్‌ వేదికగా నాగార్జున తన సంతోషాన్ని షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. ‘‘ శోభితను మా కుటుంబంలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. నూతన జంట జీవితం, ఆనందం, ప్రేమతో నిండి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 8.8.8 అనంతమైన ప్రేమకు నాంది’’ అని నాగార్జున తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇదే విషయంపై కింగ్ నాగార్జున తాజాగా ఓ ఆంగ్ల ఛానల్‌‌తో ముచ్చటించారు. ముఖ్యంగా చైతూ గురించి ఆయన ఆసక్తికర విషయాలు తెలిపారు.

Hero Nagarjuna Comment

కింగ్ నాగార్జున(Hero Nagarjuna) మాట్లాడుతూ.. ‘‘విడాకుల అనంతరం నాగ చైతన్య డిప్రెషన్‌లోకి వెళ్లాడు. కానీ తన ఫీలింగ్స్‌ను ఎవరిముందు కూడా బయటపెట్టేవాడు కాదు. నాకు తెలుసు తను హ్యాపీ‌గా లేడని. తనని అలా చూసి నాకు కూడా చాలా బాధగా అనిపించేది. ఇప్పుడు మళ్లీ చైతన్య ముఖంలో నవ్వు చూస్తున్నాను. నాగచైతన్య, శోభిత వండర్ ఫుల్ కపుల్. నిశ్చితార్థం మాత్రమే అయ్యింది. వారి పెళ్లి విషయంలో కంగారేం లేదు. మంచిరోజు అని సడెన్‌గా ఎంగేజ్‌మెంట్ కార్యక్రమం పెట్టుకున్నాం. చైతన్య మదర్ (లక్ష్మీ దగ్గుబాటి) కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శోభితా తల్లిదండ్రులకు నాగ చైతన్య అంటే ఎంతో ఇష్టం. నా కొడుకు ప్రతిభావంతుడు.. అతనికి సంతోషం అవసరం. తండ్రిగా నా ఇద్దరు కొడుకులను చూసి గర్వపడతాను. వాళ్లు సంతోషంగా ఉండాలనే ఎప్పుడూ కోరుకుంటాను..’’ అని చెప్పుకొచ్చారు. ప్రతి సందర్భంలోనూ అక్కినేని ఫ్యామిలీకి అండగా ఉంటున్నవారికి నాగ్ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం చైతూ గురించి నాగార్జున చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.

శోభిత గురించి నాగ్(Hero Nagarjuna) మాట్లాడుతూ.. శోభిత ధూళిపాళ నాకు ‘గూఢచారి’ సినిమా అప్పటి నుంచే తెలుసు. ఆ సినిమాలో శోభిత చాలా బాగా నటించింది. అప్పుడామెను అప్రిషియేట్ చేశాను కూడా. అప్పటి నుంచి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంపై మా మధ్య మాటలు నడుస్తూనే ఉన్నాయి. తను చాలా తెలివిగల అమ్మాయి. తను చైతూ లైఫ్‌లోకి రావడంతో చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇక చైతూతో నిశ్చితార్థం అనంతరం శోభిత కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘ మా అమ్మ, నాన్నలు నీకు ఏమైనా అయి ఉండవచ్చు. వారితో నీ బంధం ఏదైనా కావచ్చు.. మన పరిచయం ఎలా మొదలైనప్పటికీ.. మన హృదయాలు ప్రేమతో నిండిపోయాయి’’ అంటూ ఎర్రటి భూమి, వర్షం కాంబినేషన్‌లా అనే క్యాప్షన్‌తో చైతూతో తన ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు.

Also Read : SIMBAA Review : మదర్ నేచర్ మీద వచ్చిన ‘సింబా’ రివ్యూ

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com