Hero Karthi : ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాల హవా కొనసాగుతోంది. ఇంకొన్ని సీక్వెల్ కూడా వస్తున్నాయి. తాజాగా మరో కీలక అప్ డేట్ వచ్చింది. కార్తీ(Hero Karthi) నటించిన సూపర్ డూపర్ హిట్ మూవీ తమిళంలో వచ్చిన ఆయిరత్తిల్ ఒరువన్ తిరిగి రీ రిలీజ్ కానుంది. దీనిని తెలుగులో యుగానికి ఒక్కడు పేరుతో వచ్చింది. మార్చి 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు మూవీ మేకర్స్.
Hero Karthi Movie Re-release
ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు క్రియేటివ్ కలిగిన దర్శకుడిగా పేరు పొందిన సెల్వ రాఘవన్. తమిళ సినీ రంగానికి సంబంధించి నటీ నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు డిఫరెంట్ గా ఉండేందుకు ప్రయత్నం చేస్తారు. వారి సినిమాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. తెలుగు సినిమా పరిశ్రమ విషయానికి వస్తే హీరో డామినేషన్ ఎక్కువగా ఉండే మూవీస్ కే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది.
అందుకే వీరికి ఇక్కడ డిమాండ్ ఎక్కువ. ఇక తమిళంలో డైరెక్టర్లు కింగ్ మేకర్లుగా మారి పోయారు. ఆ మధ్యన పా రంజిత్ తీసిన కబాలి దుమ్ము రేపింది. ఆ తర్వాత మరో మూవీకి ఓకే చెప్పాడు రజనీకాంత్. సూపర్ స్టార్ అయి ఉండి ఓ కొత్త దర్శకుడి పనితీరు నచ్చి మరో మూవీకి రెడీ అయ్యాడు.
ఇక సెల్వ రాఘవన్ టేకింగ్, మేకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. తనలోని సత్తా ఏమిటో కార్తీని పెట్టి తీసిన సినిమా యుగానికి ఒక్కడు చెబుతుంది. దీనిని డ్రీమ్ వ్యాలీ కార్పొరేషన్ బ్యానర్ పై ఆర్. రవీంద్రన్ నిర్మించారు. మొత్తంగా సినీ ప్రేక్షకులకు తీపికబురు చెప్పారు మూవీ మేకర్స్.
Also Read : Hero Sandeep Kishan Mazaka :సందీప్ కిషన్ ‘మజాకా’ ట్రైలర్ రిలీజ్