Hero Gopichand : ఘాజీ దర్శకుడితో సినిమా కు సిద్ధమవుతున్న హీరో గోపీచంద్

అయితే కథల ఎంపికలో గోపీచంద్‌ జాగ్రత్త వహించాల్సిన తరుణమిది...

Hello Telugu - Hero Gopichand

Hero Gopichand : మాచో స్టార్‌ గోపీచంద్‌ సరైన హిట్‌ చూసి చాలా కాలమే అయింది. గత ఏడాది వచ్చిన ‘భీమా’ చిత్రంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల వచ్చిన ‘విశ్వం’ మళ్లీ కింద పడేసింది. జిల్‌’ దర్శకుడు రాధాకృష్ణతో ఓ సినిమా ప్లాన్‌ చేసింది యూవీ క్రియేషన్స్‌ సంస్థ. ఇందులో గోపీచంద్‌(Hero Gopichand) హీరో. అయితే ఈ ప్రాజెక్ట్‌ అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. తాజాగా గోపీచంద్‌ దగ్గరకు మరో కథ వెళ్లింది. ఘాజీ చిత్ర దర్శకుడు సంకల్ప్‌ రెడ్డి ఓ కథ వినిపించారు. ఘాజీ సక్సెస్‌ తర్వాత అంతరిక్షం సినిమా చేశారు సంకల్ప్‌రెడ్డి. ‘ఐబీ- 71’ సినిమా కూడా ఆశించిన మేర ఫలితాన్ని తీసుకురాలేకపోయింది. అయితే ఇప్పుడు ఓ కొత్త కాన్సెప్ట్‌ కథతో గోపీచంద్‌ ముందుకు వెళ్లారు. ఈ కథ గోపీచంద్‌కు కూడా బాగా నచ్చింది. చిట్టూరి శ్రీనివాస్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. ‘విశ్వం’ తరవాత గోపీచంద్‌ చేయబోయే సినిమా ఇదే. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Hero Gopichand Movies Update

అయితే కథల ఎంపికలో గోపీచంద్‌ జాగ్రత్త వహించాల్సిన తరుణమిది. భారీదనం, హెవీ యాక్షన్‌ లేకపోతే.. సినిమాలు చూడడం లేదు నేటి ప్రేక్షకులు. ముఖ్యంగా వరల్డ్‌ బిల్డింగ్‌పై మోజు పెరిగీంది. దాన్ని సరిగా వాడుకొన్న సినిమాలే వర్కవుట్‌ అవుతున్నాయి. అవన్నీ ఈ కథలో ఉండేట్టు చూసుకొన్నాడట సంకల్ప్‌రెడ్డి. తన కథలన్నీ వాస్తవ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకొంటాయి. అయితే ఈసారి అదే రూట్‌లో వెళ్తాడా లేదా కొత్త జానర్‌ తీసుకుంటాడా అన్నది చూడాలి. ఈ సినిమాతో సంకల్ప్‌ రెడ్డి జాతకం డిసైడ్‌ అయిపోతుంది. అందుకే సంకల్ప్‌ కూడా కథ విషయంలో ఎక్కడా రాజీ పడలేదని టాక్‌.

Also Read : Thangalaan OTT : ఓటీటీ కి సిద్ధమైన చియాన్ విక్రమ్ ‘తంగలాన్’ సినిమా

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com