Hero Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ నటించిన తాజా సినిమా ‘కెప్టెన్ మిల్లర్’. సత్య జ్యోతి ఫిలిమ్స్ పతాకంపై అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ధనుష్(Dhanush), ప్రియాంక అరుల్ మోహన్, శివ రాజ్‌కుమార్, సందీప్ కిషన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 1930-40ల మధ్య కాలంలో జరిగిన ఆసక్తికర కథాంశంతో యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ చెన్నైలో ‘కెప్టెన్ మిల్లర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది.
Hero Dhanush Viral
అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేదు సంఘటన జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హోస్ట్ చేస్తున్న యాంకర్ ఐశ్వర్యతో ఓ అభిమాని అసభ్యకరంగా ప్రవర్తించాడు. చాలామంది ఫ్యాన్స్ హాజరైన ఈవెంట్‌లో ఆమెను అసభ్యకరంగా తాకాడు. ఆ అభిమాని తీరుతో విసిగిపోయిన యాంకర్ ఐశ్వర్య… అతడ్ని పట్టుకుని అక్కడే దేహశుద్ధి చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారుతోంది. అయితే ఇది చూసిన నెటిజన్స్ మాత్రం యాంకర్ ఐశ్వర్యకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. వెంటనే స్పందించి అతనికి బుద్ధిచెప్పడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాలో కూడా పోస్ట్ చేసింది.
Also Read : Mammootty: ఓటీటీలో జ్యోతిక-మమ్ముట్టిల బ్లాక్ బస్టర్ సినిమా !