Hero Dhanush-Wayanad : వాయనాడ్ బాధితులకు తన వంతు విరాళం ప్రకటించిన ధనుష్

దీంతో ధనుష్ మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్...

Hello Telugu - Hero Dhanush-Wayanad

Hero Dhanush : కేరళలోని వయనాడ్ బాధితుల కోసం సినీతారలు ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇండస్ట్రీలకు చెందిన పలువురు తారలు వయనాడ్ బాధితుల కోసం భారీగా విరాళాలు అందించారు. మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, రామ్ చరణ్, మోహన్ లాల్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్స్ పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం చేశారు. అలాగే పలువురు సీనియర్ హీరోయిన్స్ కూడా భారీగా విరాళం అందించారు. తాజాగా కోలీవుడ్ హీరో ధనుష్(Hero Dhanush) సైతం వయనాడ్ బాధితుల కోసం ముందుకు వచ్చారు. ఆదివారం కేరళ సిఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 25 లక్షలు విరాళంగా అందించారు.

దీంతో ధనుష్(Hero Dhanush) మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్. కేరళలోని వయనాడ్ ప్రాంతంలో జూలై 30న జరిగిన ప్రకృతి విధ్వంసంలో దాదాపు 300 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది గల్లంతయ్యారు. కొన్ని రోజులుగా ఇండియన్ ఆర్మీ వయనాడ్ లో సహాయ చర్యలు చేపట్టింది. ఇండస్ట్రీ ట్రాకర్ శ్రీధర్ పిళ్లై X (గతంలో ట్విట్టర్)లో ఈ వార్తను పంచుకున్నారు, “ ధనుష్ వయనాడ్ కోసం కేరళ CM రిలీఫ్ ఫండ్‌కి ₹ 25 లక్షలు విరాళంగా ఇచ్చారు . హృదయపూర్వక ధన్యవాదాలు” అంటూ ట్వీట్ చేశారు.

Hero Dhanush Helps..

మరోవైపు నటుడు మోహన్ లాల్ సహాయక చర్యలలో సహాయం చేయడానికి వయనాడ్‌కు కూడా వెళ్లారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాయనాడ్‌లోని ముండక్కి, చూరల్‌మల, వెల్లరిమల గ్రామంలో పెద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో దాదాపు 300 మంది మరణించారు. వందలాది మంది వాలంటీర్లు, వైద్య సిబ్బంది, ఆర్మీ సిబ్బంది వయనాడ్ బాధితులకు సాయం చేస్తున్నారు. భారత సైన్యం రికార్డు స్థాయిలో 71 గంటల వ్యవధిలో 190 అడుగుల వంతెనను కూడా నిర్మించింది. ఇదిలా ఉంటే ఇటీవలే రాయన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు ధనుష్. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేరుడు సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో నాగార్జున, రష్మిక మందన్న కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Also Read : Hero Ram Pothineni : ఒకే నెలలో 18 కిలోలు తగ్గిన హీరో రామ్ పోతినేని

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com