Hero Darshan : జైల్లో సిగరెట్ తాగుతూ ప్రత్యక్షమైన కన్నడ హీరో ‘దర్శన్’

తాజాగా అతనికి సంబంధించిన ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది...

Hello Telugu - Hero Darshan

Hero Darshan : రేణుకాస్వామి అనే అభిమానిని హత్య చేసిన చేసులో సుమారు రెండు నెలలుగా జైలులో ఉంటున్నాడు న్నడ స్టార్ హీరో దర్శన్. పరప్పన అగ్రహారంలోని ప్రత్యేక బ్యారక్‌లో అతనిని రిమాండ్ ఖైదీగా ఉంటారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. కాగా సినిమాల్లో హీరోగా బయట ఉన్నప్పుడు లగ్జరీ జీవితం గడిపాడు దర్శన్. రాజ భోగాలు అనుభవించాడు దర్శన్. అయితే జైలు కెళ్లిన తర్వాత బాగా కుంగిపోయాడీ ఛాలెంజింగ్ స్టార్. అనారోగ్యానికి గురయ్యాడని వార్తలు కూడా వచ్చాయి. అయితే అవన్నీ అవాస్తవాలేనని తెలుస్తోంది. హీరో దర్శన్ కు జైలులోనూ అన్ని సౌకర్యాలు అందుతున్నాయని తెలుస్తోంది.

తాజాగా అతనికి సంబంధించిన ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అందులో కాఫీని ఆస్వాదిస్తూ, సిగరెట్ తాగుతూ కనిపించాడీ కన్నడీ హీరో. దర్శన్(Hero Darshan) ప్రత్యేక బ్యారక్ నుండి బయటకు వచ్చి మరో ముగ్గురితో కూర్చుని కబుర్లు చెబుతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు జైలులో దర్శన్ కు ఇంకా ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అఅలాగే జైలు అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఇది హై ప్రొఫైల్ కేసు కావడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది. విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్శన్, అతని గ్యాంగ్‌కు వ్యతిరేకంగా ఇప్పటికే చాలా రకాల సాక్షులు దొరికారు. మరికొద్ది రోజుల్లో పోలీసులు చార్జిషీటును సమర్పించనున్నారు. ఈ దశలోనే దర్శన్ ఫోటో వైరల్ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది.

Hero Darshan…

కాగా జైల్లో దర్శన్(Hero Darshan) గుండు కొట్టించుకున్నాడని వినికిడి. ఇప్పటికే పలువురు జైలును సందర్శించి దర్శన్‌ను కలిశారు. పోలీసుల విచారణలో వాంగ్మూలం ఇవ్వడంతో నటుడు చిక్కన్న కూడా జైలుకు వెళ్లి దర్శన్‌తో మాట్లాడారు. కాబట్టి వీరికి మళ్లీ పోలీసులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. కేసు దర్యాప్తు ప్రారంభించినప్పుడు దర్శన్ ఏ2గా ఉన్నారు. అయితే ఛార్జిషీటు సమర్పించే దశలో ఆయనను ఏ1గా మార్చే అవకాశాలున్నట్లు కూడా సమాచారం. మరోవైపు జైలులో ఉన్న తమ హీరో విడుదల కావాలని దర్శన్ అభిమానులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

Also Read : Thangalaan : భారీ వసూళ్లతో దూసుకుపోతున్న విక్రమ్ ‘తంగలాన్’ సినిమా

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com