Hero Danush: సత్య జ్యోతి ఫిలిమ్స్ పతాకంపై అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ధనుష్(Danush), ప్రియాంక అరుల్ మోహన్, శివ రాజ్‌కుమార్, సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన సినిమా ‘కెప్టెన్ మిల్లర్’. 1930-40ల మధ్య కాలంలో జరిగిన ఆసక్తికర కథాంశంతో యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Hero Danush Movie Updates
ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్, ఫస్ట్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘క్రీ నీడలే’ అంటూ సాగే రెండో పాటను విడుదల చేసింది చిత్ర యూనిట్. ప్రముఖ గాయకుడు జావేద్ అలీ ఆలపించిన ఈ పాట… అద్భుతమైన లిరిక్స్ తో యూట్యూబ్ లో ట్రెండింగ్ లోనికి వచ్చింది. ఈ పాటతో ‘కెప్టెన్ మిల్లర్’ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి.
Also Read : Madhuri Dixit: ఎన్నికల బరిలో బాలీవుడ్ బ్యూటీ ?