Hero Chiranjeevi : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ గా 4కె లో శంకర్ దాదా MBBS’ రి రిలీజ్

ఇలా ఒక్కటేమిటి? సినిమాను అన్నిరకాల ఎమోషన్స్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశారు...

Hello Telugu - Hero Chiranjeevi

Hero Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే (ఆగస్ట్ 22)న మెగా ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్ ఉండబోతోంది. ఆయన నటించిన బ్లాక్‌బస్టర్ సినిమాలు ఒకటి కాదు రెండూ రీ రిలీజ్ కాబోతున్నాయి. ఇప్పటికే ‘ఇంద్ర’ సినిమా రీ రిలీజ్ అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో మూవీ ‘శంకర్ దాదా MBBS’ కూడా ఆగస్ట్ 22న 4కె వెర్షన్‌లో రీ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి(Hero Chiranjeevi) నటించిన ఈ సినిమా కామెడీ అండ్ ఎమోషనల్ చిత్రంగా 2004లో ఆడియన్స్ ముందుకు వచ్చి బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. బాలీవుడ్ మూవీ ‘మున్నా భాయ్ MBBS’కి రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాని జయంత్ సి పరాన్జీ డైరెక్ట్ చేశాడు. చిరు సరసన సోనాలి బింద్రే హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో శంకర్‌ దాదాగా చిరంజీవి, ఏటీఎంగా శ్రీకాంత్ చేసిన సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Hero Chiranjeevi Movies Re-release..

ఈ సినిమాలో చిరంజీవి ఇంగ్లీష్ పదాలతో తెలుగు సామెతలు చెబుతుంటే థియేటర్స్‌లో ఆడియన్స్ అంతా కడుపుబ్బా నవ్వుకున్నారు. లింగం మాయ్యా అంటూ బాలీవుడ్ నటుడు పరేష్ రావల్‌ను చిరు ఆటపట్టించడం, సోనాలి బింద్రేతో లవ్, అరే ఏటీఎమ్ అంటూ శ్రీకాంత్‌ని పిలిచే తీరు.. ఇలా ఒక్కటేమిటి? సినిమాను అన్నిరకాల ఎమోషన్స్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశారు. అలాగే లైఫ్ జర్నీలో మనిషి ఎదుర్కొనే అనేక ఎమోషన్స్‌ని అందరి మనసుని హత్తుకునేలా ఇందులో చూపించి జయంత్ సి పరాన్జీ ప్రేక్షకుల, విమర్శకుల మన్ననలను అందుకున్నారు. ఇక ఈ సినిమాకి మరో హైలైట్ అంటే.. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సాంగ్స్, బ్రాక్‌గ్రౌండ్ మ్యూజిక్. ఈ రీ రిలీజ్‌తో థియేటర్స్ అన్ని మ్యూజికల్ కాన్సర్ట్‌గా, కామెడీ కార్నివాల్‌‌గా మారిపోవడం కాయం అనేలా.. మెగా ఫ్యాన్స్ అప్పుడే సోషల్ మీడియాలో సందడి మొదలెట్టారు.

మెగాస్టార్ చిరంజీవి(Hero Chiranjeevi) పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 22న ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ సినిమాను థియేటర్స్‌‌లో గ్రాండ్‌గా రీ రిలీజ్ చేయబోతున్నారు. భారీగా అంటే సాధ్యమైనంత ఎక్కువ థియేటర్స్‌లో విడుదల చేయడానికి డిస్ట్రిబ్యూటర్స్ ప్లాన్ చేస్తున్నారు. జె.ఆర్.కె పిక్చర్స్ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. మరో వైపు ‘ఇంద్ర’ సినిమాను కూడా భారీగా విడుదల చేసేందుకు ప్లాన్ జరుగుతున్నాయి. ఈ రెండు సినిమాలతో మెగాస్టార్ మరో ట్రెండ్ సెట్ చేయడం కాయం అనేలా మెగా ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.

Also Read : Double iSmart Review : పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని ‘డబుల్ ఇస్మార్ట్’ రివ్యూ

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com