Hero Chiranjeevi : ‘మత్తు వదలరా 2’ సినిమా చూసి ప్రశంసలు కురిపించిన మెగాస్టార్

Hello Telugu - Hero Chiranjeevi

Hero Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి త‌ను చూసిన సినిమా గురించి గానీ, మంచి సందేశాత్మ‌క చిత్రాలు వ‌చ్చిన‌ప్పుడు గానీ ఆ సినిమాల‌ను, అందులోని న‌టీన‌టుల‌ను ఇంటికి పిలిపింఉచుకుని మ‌రీ అభినందిస్తారు. కొన్ని సార్లు ఆయా సినిమాల గురించి త‌న సోష‌ల్ మీడియాలో పోస్టు పెడుతుంటారు. ఈ క్ర‌మంలోనే తాజాగా చిరంజీవి మ‌త్తు వ‌ద‌ల‌రా 2 సినిమాను చూసి ఓ రేంజ్‌లో ఆకాశానికెత్తేశారు. ఆయ‌న త‌న పోస్టులో ఏం రాసుకొచ్చారంటే.. నిన్ననే ‘మత్తు వదలరా – 2’ చూసాను. ఈ మధ్య కాలంలో మొదటి నుంచి చివరిదాకా ఇంతలా నవ్వించిన సినిమా నాకు కనపడలేదు. End Titles ని కూడా వదలకుండా చూసాను. ఈ క్రెడిట్ అంతా రితేష్ రాణాకి ఇవ్వాలి. అతని రాత , తీత , కోత , మోత, ప్రతీది చక్కగా బ్యాలెన్స్ చేస్తూ మనల్ని వినోద పర్చిన విధానానికి అభినందించకుండా వుండలేము. Caps off అంటూ త‌న అనందాన్ని పంచుకున్నారు.

Hero Chiranjeevi Appreciates

ఈ నేప‌థ్యంలో చిత్రంలోని ప్ర‌ధాన టెక్నీషియ‌న్స్ ద‌ర్శ‌కుడు రితేశ్ రాణా , హీరో శ్రీ సింహా, క‌మెడియ‌న్ స‌త్య, హీరోయిన్ ఫ‌రియా అబ్దుల్లా సంగీత ద‌ర్శ‌కుడు కాళ భైర‌వ, మైత్రీ మూవీ మేక‌ర్స్‌ల‌కు పేరుపేరున అభినంద‌న‌లు తెలిపారు.

Also Read : Thalapathy Vijay69 : తన చివరి సినిమాను అనౌన్స్ చేసిన థలపతి విజయ్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com