Hero Chiranjeevi : త్వరలో పుస్తకం రూపంలో రాబోతున్న చిరు జీవిత చరిత్ర

స్వయంగా ప్రకటించిన చిరంజీవి

Hello Telugu - Hero Chiranjeevi

Hero Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవిగా పేరొందిన కొణిదెల శివశంకర వరప్రసాద్ జీవిత చరిత్రను ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌కు చిరంజీవి అప్పగించారు. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా ప్రకటించారు. వైజాగ్‌లో లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఎన్టీఆర్‌ 28వ పుట్టినరోజు, ఏఎన్నార్‌ జయంతి కార్యక్రమానికి హాజరైన చిరంజీవి యండమూరి సమక్షంలో ఈ విషయాన్ని ప్రకటించారు. లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో యండమూరితోపాటు పలువురు ప్రముఖులకు ఫౌండేషన్‌ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరయ్యారు.

Hero Chiranjeevi Comment

ఎన్టీఆర్-ఏఎన్నార్ గొప్పతనాన్ని కొనియాడుతూ స్పీచ్ ఇచ్చిన చిరంజీవి(Hero Chiranjeevi) తన కెరీర్ గురించి కూడా చెప్పుకొచ్చారు. తన జీవిత చరిత్రను సొంతంగా రాసుకునేంత సమయం తనకు లేదని, నా జీవిత చరిత్రను రాయగలిగే సత్తా యండమూరి ఒక్కరేనని భావించి ఆ బాధ్యతను యండమూరికి అప్పగిస్తానని చిరు అన్నారు. చిరు యెండమూరిపై ప్రశంసల వర్షం కురిపించారు. “ప్రస్తుతం నా జీవిత చరిత్రను రాసుకునే సమయం నాకు లేదు, అందుకే ఈ బాధ్యతను యండమూరికే అప్పగిస్తాను” అని అభిమానుల హర్షధ్వానాలకు సమాధానంగా ప్రకటించారు.

Also Read : Prabhas Movie : ప్రభాస్ ఫ్యాన్స్ కు డైరెక్టర్ సందీప్ నుంచి గుడ్ న్యూస్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com