Hero Bunny-Pushpa 2 : మరో కొత్త స్ట్రాటజీతో రానున్న ‘పుష్ప 2’ టీమ్

'పుష్ప2' రన్ టైమ్ 3 గంటల 17 నిమిషాలు ...

Hello Telugu - Hero Bunny-Pushpa 2

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2(Pushpa 2)’ ఊచకోత ఇంకా కొనసాగుతూనే ఉంది. సంక్రాంతి సినిమాల రిలీజ్ నేపథ్యంలో పుష్పకి థియేటర్ లు భారీగా తగ్గిన సెలవు రోజు మాత్రం మంచి టికెట్ బుకింగ్స్ కనిపించాయి. ఈ నేపథ్యంలోనే మేకర్స్ సినిమా రీ లోడెడ్ వెర్షన్ రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే. వాస్తవానికి రీ లోడెడ్ వెర్షన్ జనవరి 11నే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ టెక్నీకల్ ఇష్యూస్ కారణంగా 17కి షిఫ్ట్ అయ్యారు.

Pushpa 2 Updates

‘పుష్ప2(Pushpa 2)’ రన్ టైమ్ 3 గంటల 17 నిమిషాలు .. ఇప్పుడు రీ లోడెడ్ వెర్షన్ లో మరో 20 నిమిషాలు యాడ్ చేయనున్నారు. కాగా, ఈ వెర్షన్ కు టికెట్ల ధరలను భారీగా తగ్గించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్లాన్ తో మరోసారి ప్రేక్షకులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. సంధ్య థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ ఈ వెర్షన్ కి డబ్బింగ్ చెప్పారు. సుకుమార్.. రీ రికార్డింగ్, ఎడిటింగ్ తదితర వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకున్నారు. ఈ సారి ప్రత్యేకంగా ఉత్తరాది ఆడియెన్స్ ని ఆకర్షించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఈ రూ. 1850 కోట్ల మార్కుని దాటినా ఈ సినిమా రూ. 2000 కోట్లను కొల్లగొట్టి దంగల్ రికార్డును చెరిపేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

ఇకఈ సినిమా కథ విషయానికిస్తే.. ఎర్రచందనం కూలీగా కెరీర్‌ మొదలుపెట్టి సిండికేట్‌ని, రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతాడు పుష్పరాజ్‌ (అల్లు అర్జున్‌). అధికార పార్టీకి సైతం ఫండ్‌ ఇచ్చే స్థాయికి చేరుకుంటాడు. సీఎంను కలిసి వద్దామని పుష్ప బయలుదేరితే.. ‘వస్తూ వస్తూ సీఎమ్‌తో ఓ ఫొటో తీసుకుని రా’ అంటూ తన భార్య శ్రీవల్లి(రష్మిక) కోరిక కోరుతుంది. (రష్మిక).

అయితే స్మగ్లర్లు పార్టీ ఫండ్‌ ఇచ్చేంత వరకే కానీ ఫొటోలు దిగడానికి కాదని అధికార సీఎం హేళనగా మాట్లాడతాడు. దానిని సీరియస్‌గా తీసుకున్న పుష్ప ఎంపీ సిద్దప్ప (రావు రమేష్‌)తో ఓ ఫొటో తీసుకొని, తననే ముఖ్యమంత్రిని చేస్తా అని మాట ఇస్తాడు. అందుకోసం రూ.500 కోట్లు ఫండ్‌ ఇవ్వడానికి సిద్ధపడతాడు. దాని కోసం 2000 టన్నుల ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేయాల్సి వస్తుంది. ఆ స్మగ్లింగ్‌ని ఆపడానికి, తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ (ఫహద్‌ ఫాజల్‌) ప్రయత్నాలు చేస్తాడు. భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ని దాటుకొని ఆ 2000 వేల టన్నులు స్మగ్లింగ్‌ చేయగలిగాడా, లేదా? శ్రీవల్లికి ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకున్నాడు? ఇంటి పేరు, కుటుంబం కోసం పాకులాడే పుష్పకు అది ఎలా దక్కింది? అన్నది కథ.

Also Read : చెల‌రేగిన స్మృతి మంధాన‌..ప్ర‌తీకా రావ‌ల్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com