Hero Balakrishna: అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్‌కేసరి సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పుడు సిక్సర్‌పై కన్నేశారు. మెగాస్టార్ చిరంజీవితో ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో బాలకృష్ణ తన 109వ సినిమాను ప్రారంభించారు. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఎస్ నాగవంశీ నిర్మిస్తుండగా బాలకృష్ణ సరసన ఊర్వశి రౌతేలా .. మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన యానిమల్ సినిమాతో టాలీవుడ్ కు దగ్గరైన బాబీ డియోల్… బాలయ్య సినిమాలో విలన్ గా నటిస్తుండగా… కోలీవుడ్ దర్శకుడు, నటుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్‌కేసరి సినిమాలు ఒకటిని మించి మరొకటి కలెక్షన్ల వసూలు చేయడంతో… బాబీ-బాలయ్య మాస్ యాక్షన్ పై అంచనాలు మరింత పెరిగిపోయాయి.
Hero Balakrishna in Pushpa Movie Spot
బాబీ-బాలయ్య కాంబోలో వస్తున్న ఈ సినిమా భారీగా అంచనాలు నెలకొనడంతో షూటింగ్ ను శరవేగంగా చేస్తుంది చిత్ర యూనిట్. ఈ సినిమాకు సంబంధించిన తాజా షెడ్యూల్ తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం, మారేడుమిల్లి ఫారెస్ట్ లో జరపుతున్నారు. బాలకృష్ణతో(Balakrishna) పాటు ప్రధాన నటీనటులు ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. గతంలో పుష్ప షూటింగ్ నిర్వహించిన డీప్ ఫారెస్ట్ లో ఎముకలు కొరికే చలిలో బాలయ్య మాస్ యాక్షన్ సీన్లు తెరకెక్కిస్తున్నారు. మూడు డిఫరెంట్ లుక్స్ లో బాలకృష్ణ కనిపించబోయే ఈ సినిమాలో… కథ, కథనం, సినేరియా కొత్తగా ఉంటుందని, అభిమానులు పండుగ చేసుకునేలా బాలకృష్ణ కేరక్టరైజేషన్ ఉంటుందని దర్శకుడు బాబీ చెబుతున్నారు. ప్రధాన తారాగణంపై ఇప్పటికే కొంత షూటింగ్ పూర్తయిందని… మరో వారం రోజుల పాటు రంపచోడవరం, మారేడుమిల్లి ఫారెస్ట్ లో షూటింగ్ కొనసాగుతోందని చిత్ర యూనిట్ నుండి అందుతున్న సమాచారం. దీనితో బాలయ్యను చూసేందుకు అభిమానులతో పాటు చుట్టుప్రక్కల ప్రజలు పెద్ద ఎత్తున షూటింగ్ స్పాట్ కు తరలివస్తున్నారు.
Also Read : AR Rahman: రామ్ చరణ్ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం !