Hero Allu Arjun: స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘పుష్ప2’ షూటింగ్ తో బిజీగా ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్… తదుపరి సినిమాపై ఇప్పటినుండే సోషల్ మీడియాలో చర్చ ప్రారంభమైంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందడటమే కాకుండా… ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కైవసం చేసుకున్న అల్లు అర్జున్ తరువాత సినిమా ఎవరితో చేయబోతున్నాడనేదానిపై నెట్టింట చర్చోపచర్చలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఐకాన్ స్టార్ నెక్స్ట్ సినిమాను… జవాన్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న కోలీవుడ్ యువ దర్శకుడు అట్లీతో చేస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నారు. దీనితో అట్లీతో అల్లు అర్జున్(Allu Arjun) సినిమా అనేసరికి అభిమానులు సంబరపడుతున్నారు.
Hero Allu Arjun May be Movie with Atlee
యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించనున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించనున్నఈ సినిమాలో బన్నీ న్యూలుక్‌లో కనిపించనున్నారని సమాచారం. వచ్చే ఏడాదిలోనే ఈ సినిమా ప్రారంభించాలని అట్లీ అనుకుంటున్నారని… ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయనీ.. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ‘పుష్ప2’ షూటింగ్ పూర్తి కాగానే అట్లీ ప్రాజెక్ట్‌పై బన్నీ పూర్తి దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల కింగ్ ఖాన్ షారూక్ ఖాన్, విజయ్ సేతుపతి, నయనతార, దీపిక పదుకునే ప్రధాన పాత్రల్లో అట్లీ తెరకెక్కించిన సినిమా ‘జవాన్’. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని నమోదు చేయడంతో… అల్లు అర్జున్ ఆ చిత్రబృందాన్ని అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఆ పోస్ట్‌కు అట్లీని, మ్యూజిక్ దర్శకుడు అనిరుధ్‌ను ట్యాగ్ చేసి ‘నా సినిమాకు కూడా ఇలానే మ్యూజిక్ అందించాలి’ అని కామెంట్ పెట్టారు. దీనితో త్వరలోనే అట్లీ-అల్లు అర్జున్‌ల కాంబోలో సినిమా రానుందని. దానికి అనిరుధ్ స్వరాలు అందించనున్నారని నెట్టింట చర్చ జరుగుతోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న‘పుష్ప2’ వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. దీనితో ‘పుష్ప2’ షూటింగ్ పూర్తయిన వెంటనే అట్లీతో సినిమాను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
Also Read : Big Boss Beauties: త్వరలో పెళ్ళి పీటలెక్కున్న బిగ్ బాస్ బ్యూటీస్ ప్రియాంక, శోభా !