Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి ఏపీ హైకోర్టు ఊరటనించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే కారణంతో నంద్యాల పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో తమపై నమోదు చేసిన కేసులను కొట్టేయాలంటూ బన్నీ, మాజీ ఎమ్మెల్యే రవి చంద్ర కిషోర్ రెడ్డి వేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. ఎఫ్ఎఆర్ ఆధారంగా నవంబరు 6 వరకు తదుపరి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశించింది. నవంబరు 6న తగిన ఉత్తర్వులిస్తామని హైకోర్టు తెలిపింది.
Allu Arjun Case…
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే కారణంతో నంద్యాల పోలీసులు అల్లు అర్జున్(Allu Arjun)పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో తమపై నమోదు చేసిన కేసులను కొట్టేయాలంటూ బన్నీ, మాజీ ఎమ్మెల్యే రవి చంద్ర కిషోర్ రెడ్డి వేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. ఎఫ్ఎఆర్ ఆధారంగా నవంబరు 6 వరకు తదుపరి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశించింది. నవంబరు 6న తగిన ఉత్తర్వులిస్తామని హైకోర్టు తెలిపింది.
మరోవైపు ఎన్నికల సమయంలో తన ఫ్రెండ్ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్.. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ట్వీట్ చేసి.. శిల్పా రవి ఇంటికి వెళ్లి మరీ విష్ చేయడాన్ని మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు మెగా, అల్లు కుటుంబాల ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. దీంతో ఇప్పుడు నంద్యాల విషయంపై బన్నీ’ఆహా’ ‘అన్‌స్టాపబుల్’ సీజన్ 4’ లో బాలయ్యతో క్లారిటీ ఇచ్చేలా అల్లు అరవింద్ ప్లాన్ చేశాడు.
Also Read : Jani Master Release : జైలు నాకు చాలా జీవితాన్నే నేర్పించింది