Akshay Kumar : బాలీవుడ్ లో అత్యధిక ఫ్లాప్స్ అందుకున్న హీరో ఎవరు అంటే టక్కున చెప్పే పేరు అక్షయ్ కుమార్. అక్షయ్ కుమార్ హిట్స్, ఫ్లాప్స్ అనే సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఏడాదికి 4, 5 సినిమాలు చేస్తూ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కోవిడ్ పాండమిక్ తర్వాత అక్షయ్ కుమార్ నటించిన 15 సినిమాలు విడుదలయ్యాయి. ఇందులో 2-3 సినిమాలు మాత్రమే విజయం సాధించాయి. అక్షయ్ కుమార్ సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఆయన చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ అవుతున్నాయి. తాజాగా అక్షయ్ నటించిన సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. దాంతో అక్షయ్ కుమార్ పై విమర్శలు వస్తున్నాయి. తనపై విమర్శల గురించి తాజాగా అక్షయ్ కొన్ని కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ఇపుడు వైరల్‌గా మారాయి.
Akshay Kumar Comment
అక్షయ్ కుమార్ సినిమాలపై పెట్టుబడి పెట్టిన నిర్మాతలు కష్టాల్లో పడ్డారు. అయితే అక్షయ్(Akshay Kumar) తన రెమ్యునరేషన్ మాత్రం తగ్గించుకోవడానికి సిద్ధంగా లేడు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ‘ఏది జరిగినా అది మంచికే. నేను ఎక్కువగా ఆలోచించను, ఒత్తిడి తీసుకోను. నాలుగైదు సినిమాలు బాగా ఆడకపోవడంతో చనిపోయినట్టు కాదు.. మీరు నాకు సంతాపం తెలుపుతూ.. మెసేజ్‌లు చేయకండి ‘ అని అక్షయ్ కుమార్ అన్నారు. ‘ నేను తిరిగి రావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. నేను ఎక్కడికి వెళ్ళాను? నేను ఎప్పుడూ ఇక్కడే ఉంటాను. నిరంతరం పని చేస్తాను. మీరు ఏమి చెప్పినా నేను నా పనిని కొనసాగిస్తాను. నేను కష్టపడి డబ్బు సంపాదిస్తాను, యాచించడం లేదు. నా జీవితం ముగిసే వరకు పని చేస్తానని అక్షయ్ కుమార్ అన్నారు. అక్షయ్ కుమార్ ‘బడే మియా చోటే మియా’ సినిమాతో పెద్ద ఫ్లాప్ చవిచూశాడు. ‘ సర్ఫిరా’ కూడా నిరాశపరిచింది. అక్షయ్ కుమార్ నటించిన ‘ఖేల్ ఖేల్ మే’ ఆగస్ట్ 15న విడుదల కానుంది. ఇది కాకుండా ఈ ఏడాది మరో రెండు సినిమాలు విడుదల కానున్నాయి.
Also Read : Malavika Mohanan : డార్లింగ్ ప్రభాస్ ‘రాజా సాబ్’ మాళవిక బర్త్ డే వేడుకలు